iDreamPost
android-app
ios-app

KL Rahul: ఇంత బాగా ఆడుతున్నా సెలక్ట్ చేయలేదు.. రాహుల్​ను దూరం పెట్టడానికి కారణం!

  • Published Jan 08, 2024 | 10:07 AM Updated Updated Jan 08, 2024 | 9:57 PM

ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్​కు 16 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్​ను ప్రకటించారు సెలక్టర్లు. అయితే ఇందులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​కు చోటు దక్కలేదు. రాహుల్​ను పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్​కు 16 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్​ను ప్రకటించారు సెలక్టర్లు. అయితే ఇందులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్​కు చోటు దక్కలేదు. రాహుల్​ను పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 08, 2024 | 10:07 AMUpdated Jan 08, 2024 | 9:57 PM
KL Rahul: ఇంత బాగా ఆడుతున్నా సెలక్ట్ చేయలేదు.. రాహుల్​ను దూరం పెట్టడానికి కారణం!

కేఎల్ రాహుల్.. ఈ మధ్య కాలంలో టీమిండియాలో కన్​సిస్టెంట్​గా రాణిస్తున్న క్రికెటర్. ఫార్మాట్​తో సంబంధం లేకుండా అతడు బ్యాట్​తో చెలరేగుతున్నాడు. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన రాహుల్.. ట్రీట్​మెంట్ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కొన్నాళ్లు ఉన్నాడు. అక్కడ తన ఫిట్​నెస్​తో పాటు బ్యాటింగ్ టెక్నిక్ మీద ఫోకస్ పెట్టాడు. రీఎంట్రీ తర్వాత ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్-2023లో దుమ్మురేపాడు రాహుల్. బ్యాటింగ్​తో పాటు కీపింగ్​లోనూ అదరగొట్టాడు. సౌతాఫ్రికా టూర్​లో తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. అయినా అతడికి మొండిచెయ్యి ఎదురైంది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే మూడు టీ20ల సిరీస్​కు రాహుల్​ను సెలక్ట్ చేయలేదు. ఈ స్టైలిష్ బ్యాటర్​కు సెలక్టర్లు షాకిచ్చారు. ఇంత బాగా ఆడుతున్నా అతడ్ని ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పుడు చూద్దాం..

సూపర్ ఫామ్​లో ఉన్న కేఎల్ రాహుల్​ను ఆఫ్ఘానిస్థాన్ సిరీస్​కు సెలక్ట్ చేయకపోవడంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. వన్డేలు, టెస్టుల్లో అదరగొడుతున్న బ్యాటర్​ను ఇలా పక్కన పెట్టడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ సిరీస్​కు ఎంపిక చేయలేదంటే జూన్​లో జరిగే టీ20 వరల్డ్ కప్​లో అతడ్ని తీసుకునే ఛాన్సే లేదని అంటున్నారు. అయితే రాహుల్​ను సెలక్టర్లు పక్కన పెట్టడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత భారత జట్టులో మిడిలార్డర్​లో తిలక్ వర్మ, లోయరార్డర్​లో రింకూ సింగ్ ఉన్నారు. వీళ్లిద్దరూ టీ20ల్లో అద్భుతంగా ఆడుతూ మ్యాచ్​లు ఫినిష్ చేస్తున్నారు. దీంతో రాహుల్​ను దూరం పెట్టినట్లుగా కనిపిస్తోంది.

kl rahul not selected

రింకూ కాదు గానీ తిలక్​తో రాహుల్​కు ప్రధాన పోటీ నెలకొంది. అయితే లెఫ్టాండ్ బ్యాటర్ అవ్వడం, స్పిన్ బౌలింగ్​తో వికెట్లు తీసే సత్తా ఉండటం, టీ20ల్లో కన్​సిస్టెంట్​గా రాణిస్తుండటంతో రాహుల్​కు బదులు తిలక్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్​లో బాగా పెర్ఫార్మ్ చేస్తే రాహుల్​ను టీ20 వరల్డ్ కప్​ టీమ్​లోకి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ గాయాలతో దూరమైన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాతో పాటు ఇషాన్ కిషన్ టీమ్​లోకి వస్తే మిడిలార్డర్, లోయరార్డర్​లో తీవ్ర పోటీ నెలకొంటుంది. సూర్య, పాండ్యా, జడ్డూలు ఫిట్​గా ఉంటే నేరుగా టీమ్​లోకి వచ్చేస్తారు. కాబట్టి రాహుల్​కు స్క్వాడ్​లో చోటు దక్కడం కష్టమే.

టీ20లకు తగ్గట్లుగా ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడలేకపోవడం రాహుల్​కు బిగ్ మైనస్​గా మారింది. క్రీజులో కుదురుకునేందుకు చాలా టైమ్ తీసుకునే రాహుల్.. సెటిలయ్యాక మాత్రం షాట్లు ఆడతాడు. స్లో బ్యాటింగ్ కారణంగా కొన్నిసార్లు అతడు విమర్శలపాలయ్యాడు. అయితే ఈ మధ్య బ్యాటింగ్ శైలి మార్చుకున్న రాహుల్ వేగంగా పరుగులు చేస్తున్నాడు. ఆఫ్ఘాన్ సిరీస్​కు ఎంపిక చేయలేదు కాబట్టి ఐపీఎల్​లో అతడు మరింత రెచ్చిపోయే ఆడే అవకాశం ఉంది. అయితే రాహుల్ ఫ్యాన్స్ మాత్రం సెలక్టర్లపై సీరియస్ అవుతున్నారు. ఇంత బాగా ఆడుతున్నా అతడ్ని ఎంపిక చేయకపోవడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రాహుల్​ను పక్కన పెట్టడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Swetha Sehrawat: లేడీ సెహ్వాగ్.. 31 ఫోర్లు.. 7 సిక్సర్లతో భారీ విధ్వంసం