iDreamPost
android-app
ios-app

Team India: గెలిచారు సరే.. ఆఫ్ఘాన్​ పైనే ఇలా ఆడితే ఇంకా వరల్డ్ కప్​లో పరిస్థితి ఏంటి?

  • Published Jan 19, 2024 | 3:50 PMUpdated Jan 19, 2024 | 3:50 PM

ఆఫ్ఘానిస్థాన్​తో స్వదేశంలో జరిగిన సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయడంతో టీమిండియా ఫుల్ జోష్​లో ఉంది. అయితే జట్టులో మాత్రం ఇంకా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి.

ఆఫ్ఘానిస్థాన్​తో స్వదేశంలో జరిగిన సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయడంతో టీమిండియా ఫుల్ జోష్​లో ఉంది. అయితే జట్టులో మాత్రం ఇంకా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి.

  • Published Jan 19, 2024 | 3:50 PMUpdated Jan 19, 2024 | 3:50 PM
Team India: గెలిచారు సరే.. ఆఫ్ఘాన్​ పైనే ఇలా ఆడితే ఇంకా వరల్డ్ కప్​లో పరిస్థితి ఏంటి?

భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టూర్​లో ఏ సిరీస్​లోనూ ఓడిపోకుండా స్వదేశానికి వచ్చింది టీమిండియా. ఆ తర్వాత ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మిగిలిన ఫార్మాట్లను పక్కన పెడితే ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్-2024 జరగనుంది. కాబట్టి మెగా టోర్నీకి ముందు టీమ్ కాంబినేషన్ మీద అవగాహనకు రావడానికి ఆఫ్ఘాన్ సిరీస్​ను పూర్తిగా యూజ్ చేసుకోవాలని భారత మేనేజ్​మెంట్ భావించింది. ఈ క్రమంలో పలు ప్రయోగాలు కూడా చేసింది. వాటిల్లో కొన్ని సక్సెస్ అయినా మరికొన్ని బెడిసికొట్టాయి. పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబె, ఫినిషర్ రింకూ సింగ్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తమకు వచ్చిన ఛాన్సులను బాగా వాడుకున్నారు. అయితే మిగిలిన చాలా అంశాల్లో భారత్ వీక్​గా కనినిపిస్తోంది. ఇంకా జట్టును పలు సమస్యలు వేధిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బ్యాటింగ్ పరంగా టీమిండియా పలు ఇబ్బందులను ఫేస్ చేస్తోంది. ఓపెనర్​గా రోహిత్ శర్మకు తోడుగా కుర్రాడు యశస్వి జైస్వాల్ ప్రామిసింగ్​గా కనిపిస్తున్నాడు. అయితే అటు రోహిత్, ఇటు జైస్వాల్​.. ఇద్దరిలో ఒక్కరు కూడా కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం లేదు. హిట్​మ్యాన్​ క్రీజులో నిలబడితే పరుగులు చేయడం నీళ్లు తాగినంత ఈజీ. కానీ చాన్నాళ్ల తర్వాత ఆడటం, వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధ వెంటాతుండటం, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తీసేయడం లాంటి వాటి నుంచి బయటపడకపోవడం వల్ల కావొచ్చు సరిగ్గా కాన్​సంట్రేట్ చేయట్లేదు. కానీ చివరి మ్యాచ్​లో పంజా విప్పిన రోహిత్.. బ్యాట్​తో చెలరేగడమే గాక కెప్టెన్​గానూ ఆకట్టుకున్నాడు. అతడితో పాటు జైస్వాల్​ కూడా కన్​సిస్టెన్సీ మెయింటెయిన్ చేస్తే మన టీమ్​కు తిరుగుండదు.

Do not see these mistakes

ఫస్ట్ డౌన్ సమస్య కూడా భారత్​ను ఇబ్బంది పెడుతోంది. హైదరాబాదీ తిలక్ వర్మకు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా యూజ్ చేసుకోలేదు. మొదట్లో మెరుపులు మెరిపించిన తిలక్.. సౌతాఫ్రికా సిరీస్​తో పాటు ఆఫ్ఘాన్​తో తొలి మ్యాచ్​లోనూ ఫెయిలయ్యాడు. సిరీస్​లోని ఆఖరి రెండు మ్యాచులకు తిలక్ ప్లేస్​లో విరాట్ కోహ్లీ ఆడాడు. అయితే అతడు కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. ఒక మ్యాచ్​లో 29 రన్స్.. మరో దాంట్లో గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. విరాట్ రన్స్ చేయకపోయినా క్రీజులో ఉంటే చాలు.. ప్రత్యర్థి జట్లు డిఫెన్స్​లో పడతాయి. ఫాస్ట్​గా ఆడాలని హిట్టింగ్​కు వెళ్తున్నాడు తప్పితే.. తన బలమైన టైమింగ్​ను అతడు నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. ఐపీఎల్​లోనైనా విరాట్ తిరిగి గాడిన పడాలని భారత టీమ్ మేనేజ్​మెంట్ కోరుకుంటోంది. టీమిండియాను వేధిస్తున్న మరో ప్రాబ్లమ్ పేస్ బౌలింగ్. ఆఫ్ఘాన్​తో సిరీస్​లో ఒక్క పేసర్ కూడా మ్యాజికల్ స్పెల్ వేయలేదు.

ఆఫ్ఘాన్​ సిరీస్​లో ఆడిన అవేశ్​ ఖాన్, ముకేశ్ కుమార్ దారుణంగా ఫెయిలయ్యారు. వికెట్ల సంగతి పక్కనపెడితే కనీసం రన్స్ కూడా ఆపలేకపోయారు. స్పిన్నర్ల పెర్ఫార్మెన్స్ కూడా దారుణంగా ఉంది. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్​లు లైన్ లెంగ్త్ తప్పడంతో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఉన్నవాళ్లలో కాస్త బాగా బౌలింగ్ చేసిందంటే ఒక్క వాషింగ్టన్ సుందర్ అనే చెప్పాలి. లైన్ అండ్ లెంగ్త్​ను నమ్ముకొని వేరియేషన్స్​తో పకడ్బందీగా బౌలింగ్ చేశాడు. సీనియర్ క్యాంపెయినర్లు అయిన కుల్దీప్, బిష్ణోయ్ స్వదేశీ పిచ్​లపై టర్న్ రాబట్టడంలో ఫెయిలయ్యారు. ఆఫ్ఘాన్​తో ఆఖరి మ్యాచ్​లో రెండో సూపర్​ ఓవర్​లో గెలిచింది రోహిత్ సేన. ఈ టీమ్​ మీదే ఇలా ఉంటే టీ20 వరల్డ్ కప్​లో ప్రధాన జట్లతో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఓవరాల్​గా చూసుకుంటే భారత జట్టులో బ్యాటింగ్​లో కన్​సిస్టెన్సీ రావాలి. టాపార్డర్​లో నుంచి ఎవరో ఒకరు చివరి వరకు నిలబడి మ్యాచ్​లు ఫినిష్ చేయాలి. బౌలింగ్​లో లైన్ అండ్ లెంగ్త్​కు కట్టుబడాలి. కుర్రాళ్లు ఎక్స్​ ఫ్యాక్టర్​గా మారాలి. పై సమస్యలను రోహిత్​తో పాటు టీమ్ మేనేజ్​మెంట్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అప్పుడే టీ20 వరల్డ్ కప్​లో మనకు తిరుగుండదు. మరి.. టీమిండియాలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి