iDreamPost
android-app
ios-app

IND vs AFG: ఆఫ్ఘాన్​తో చివరి టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

  • Published Jan 18, 2024 | 8:45 AM Updated Updated Jan 18, 2024 | 8:45 AM

ఆఫ్ఘానిస్థాన్​ను టీమిండియా వైట్​వాష్ చేసింది. బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అయితే రెండు సూపర్ ఓవర్లు జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘానిస్థాన్​ను టీమిండియా వైట్​వాష్ చేసింది. బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. అయితే రెండు సూపర్ ఓవర్లు జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 18, 2024 | 8:45 AMUpdated Jan 18, 2024 | 8:45 AM
IND vs AFG: ఆఫ్ఘాన్​తో చివరి టీ20.. భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

ఆఫ్ఘానిస్థాన్​తో సిరీస్​ను విజయంతో ముగించింది భారత్. ఊహించినట్లుగానే పర్యాటక జట్టును 3-0తో వైట్​వాష్ చేసింది. అయితే ఇది సాధారణ మ్యాచ్​ కాదు. ఏకంగా రెండు సూపర్​ ఓవర్​లు జరిగిన మ్యాచ్. టీ20ల్లో సూపర్ ఓవర్​లు చూస్తూనే ఉంటాం. కానీ విన్నర్ ఎవరో తేలడానికి రెండు సూపర్ ఓవర్లు పట్టింది. అయితే ఆఖరికి భారత్​నే విజయం వరించింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘాన్ అన్నే ఓవర్లు ఆడి 6 వికెట్లకు 212 రన్స్ చేసింది. మొదటి సూపర్ ఓవర్ డ్రా కాగా.. రెండో సూపర్ ఓవర్​లో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో రోహిత్ సేన విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చివరి టీ20లో భారత విజయానికి ప్రధాన కారణాల్లో మొదటిది రోహిత్ శర్మ బ్యాటింగ్. మొదటి టీ20లో 0 పరుగులకే రనౌట్ అయిన హిట్​మ్యాన్.. రెండో మ్యాచ్​లోనూ గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. కానీ థర్డ్ టీ20లో మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 22 రన్స్​కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకున్నాడు. 69 బంతుల్లో 121 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. 11 బౌండరీలతో పాటు ఏకంగా 8 సిక్సులు బాదాడు. అతడి జోరును ఎలా అడ్డుకోవాలో తెలియక ఆఫ్ఘాన్ బౌలర్లు గుడ్లు తేలేశారు. రోహిత్ వల్లే టీమ్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్​లో టీమిండియా విజయానికి మరో కారణం రోహిత్-రింకూ సింగ్ పార్ట్​నర్​షిప్. ఇన్నింగ్స్​ మొదట్లో త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. కానీ రింకూ (39 బంతుల్లో 69) అండగా రోహిత్ చెలరేగియాడు.

team india winning

రోహిత్-రింకూ అసలైన టీ20 తరహా బ్యాటింగ్​తో భారీ షాట్స్ కొట్టడంతో స్కోరు బోర్డు బుల్లెట్ స్పీడ్​తో దూసుకెళ్లింది. రోహిత్​తో పోటీపడిన రింకూ ఏకంగా 6 భారీ సిక్సులు బాదాడు. వీళ్లిద్దరూ కలసి ఐదో వికెట్​కు ఏకంగా 190 పరుగులు జోడించడం విశేషం. ఈ మ్యాచ్​లో మన టీమ్ గెలుపునకు మరో కారణం వాషింగ్టన్ సుందర్. భారీ స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ సూపర్బ్​గా ఆడుతూ వచ్చింది. అయితే ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు సుందర్. వరుస బంతుల్లో ఇబ్రహీం జాద్రాన్ (50)తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయి (0)ని వెనక్కి పంపాడు. సిక్సులతో విరుచుకుపడిన మహ్మద్ నబీ (34)ను కూడా అతడే ఔట్ చేశాడు. ఇలా కీలకమైన మూడు వికెట్లు తీసి ఆఫ్ఘాన్​ స్పీడ్​కు బ్రేకులు వేశాడు. ఈ మ్యాచ్​లో భారత్ విజయానికి మరో కారణం స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఛేజింగ్ టైమ్​లో ఒక్క వికెట్ కూడా తీయని బిష్ణోయ్ సూపర్ ఓవర్​లో మ్యాజిక్ చేశాడు.

రెండో సూపర్ ఓవర్​లో బిష్ణోయ్ కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మూడు బంతుల్లోనే ఆఫ్ఘాన్ల పనిపట్టాడు. వరుస బంతుల్లో నబి, రెహ్మానుల్లా గుర్బాజ్​ను ఔట్ చేశాడు. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో టీమిండియా విజయానికి మరో కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ. ఈ మ్యాచ్​లో బ్యాట్​తో చెలరేగిన హిట్​మ్యాన్.. సారథ్యంలోనూ తన మార్క్ చూపించాడు. ఛేజింగ్​లో సుందర్​తో కీలక టైమ్​లో బౌలింగ్ వేయించి బ్రేక్ త్రూలు వచ్చేలా చేశాడు. సూపర్ ఓవర్​లో తన కంటే రింకూ బాగా పరిగెత్తుతాడని తెలివిగా బ్యాటింగ్ మధ్యలో నుంచి బయటకు వచ్చేశాడు. ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని రీతిలో బిష్ణోయ్​తో సెకండ్ సూపర్​ ఓవర్​ వేయించాడు. ఇలా అతడు తీసుకున్న అన్ని నిర్ణయాలు భలేగా వర్కవుట్ కావడంతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్​లో భారత్ గెలిచింది. మరి.. ఈ మ్యాచ్​లో రోహిత్ సేన విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఒకే ఓవర్లో 36 పరుగులు.. రోహిత్- రింకూ విధ్వంసం చూడండి!