Gautam Gambhir: టీమిండియాకు వాళ్ల అవసరం ఉంది.. అలాంటోళ్లనే తీసుకుంటాం: గంభీర్

టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ అప్పుడే పని మొదలుపెట్టాడు. ఇంకా ఒక్క సిరీస్​ కూడా స్టార్ట్ కాకుండానే తనకు ఎలాంటి ప్లేయర్లు కావాలనేది అతడు స్పష్టం చేశాడు.

టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ అప్పుడే పని మొదలుపెట్టాడు. ఇంకా ఒక్క సిరీస్​ కూడా స్టార్ట్ కాకుండానే తనకు ఎలాంటి ప్లేయర్లు కావాలనేది అతడు స్పష్టం చేశాడు.

టీమిండియా నయా కోచ్ గౌతం గంభీర్ అప్పుడే తన పని మొదలుపెట్టాడు. ఇంకా ఒక్క సిరీస్​ కూడా స్టార్ట్ కాకుండానే భారత క్రికెట్​పై తన మార్క్ చూపిస్తున్నాడు. ప్లేయర్ల ఫిట్​నెస్ మేనేజ్​మెంట్ దగ్గర నుంచి సెలెక్షన్ వరకు అతడు పలు విషయాలపై తన ఆలోచనలు నిక్కచ్చిగా చెబుతున్నాడు. టీమిండియా ప్లేయర్లు అందరూ కచ్చితంగా మూడు ఫార్మాట్లలోనూ ఆడి తీరాల్సిందేనని అన్నాడు. గాయం సాకు చూపి తప్పించుకునేందుకు వీల్లేదని చెప్పాడు. ఫిట్​నెస్, ఫామ్ ఉన్నప్పుడే జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్​లు ఆడటం, ఎక్కువ విజయాలు సాధించడంపై ఫోకస్ చేయాలని ఆటగాళ్లకు సూచించాడు. అలాగే ప్రతి ప్లేయర్ నేషనల్ డ్యూటీ లేనప్పుడు దేశవాళీ మ్యాచులు ఆడాలని స్పష్టం చేశాడు.

టీమిండియా సెలెక్షన్ మీద కూడా గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టుకు వైవిధ్యమైన ఆటగాళ్ల ఆవశ్యకత ఉందన్నాడు. ‘భారత్​కు డిఫరెంట్ ప్లేయర్స్ కావాలి. ముఖ్యంగా వన్డేల్లో వైవిధ్యమైన ఆటగాళ్లను ఆడించాల్సిన అవసరం ఉంది. యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడుతూ క్రీజులో పాతుకుపోయే వారు కావాలి. అలాగే ఫియర్​లెస్ అప్రోచ్​తో అపోజిషన్ బౌలర్లను చిత్తు చేసే వాళ్లూ అవసరమే. కఠిన పరిస్థితులు నెలకొన్నప్పుడు కండీషన్స్​కు తగ్గట్లుగా ఆడుతూ జట్టును గట్టున పడేసే ప్లేయర్లు కూడా కావాలి. ఒకే రకమైన ఆటగాళ్లతో టీమ్​ను నింపడం సరికాదు. విభిన్నమైన టాలెంట్ ఉన్న వాళ్లు, ట్రెడిషనల్ గేమ్ ఆడేవారి కలబోతతో టీమ్ కాంబినేషన్​ను సెట్ చేయాలి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది టీమిండియా. అక్కడ టీ20లతో పాటు వన్డే మ్యాచులు కూడా ఆడనుంది. కోచ్​గా గంభీర్​కు ఇదే ఫస్ట్ సిరీస్. ఈ టూర్​లో పాల్గొనే ప్లేయర్లను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీమ్ నిండా ఒకే రకమైన ఆటగాళ్లు అవసరం లేదని.. డిఫరెంట్ టాలెంట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. మ్యాచ్ సిచ్యువేషన్, కండీషన్స్​కు తగ్గట్లు ఆడేవారు తమకు కావాలని చెప్పాడు. గంభీర్ మాటల్ని బట్టి చూస్తే కోచ్​గా సెలెక్షన్ దగ్గర నుంచి ప్లేయింగ్ ఎలెవన్, వ్యూహాలు పన్నడం.. ఇలా ప్రతి దాంట్లోనూ భారత్ సరికొత్తగా కనిపించడం ఖాయమని అర్థమవుతోంది. మరి.. సెలెక్షన్​ మీద గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments