SNP
IND vs SL, Rishabh Pant: శ్రీలంకతో సిరీస్‌ను సమం చేయాలనే కసితో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
IND vs SL, Rishabh Pant: శ్రీలంకతో సిరీస్‌ను సమం చేయాలనే కసితో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో చివరి వన్డేకు సిద్ధమైంది భారత జట్టు. బుధవారం కొలంబో వేదికగా చివరిదైన మూడో వన్డే ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే టై అయిన విషయం తెలిసిందే. అలాగే రెండో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించి.. సిరీస్‌లో 0-1తో ముందంజలో ఉంది. చివరి వన్డే కూడా గెలిస్తే శ్రీలంక 0-2తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. అయితే.. లంకకు ఆ అవకాశం ఇవ్వకుండా.. ఎలాగైన మూడో వన్డేలో గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. గెలవాల్సిన తొలి టై కావడం, రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలు కావడంతో రోహిత్ సేన ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. మూడో వన్డేలో గెలిచేందుకు పటిష్టమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగనుంది.
బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న టీమిండియా బ్యాటింగ్‌లోనే ఫేలవ ప్రదర్శన కనబరుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే మెరుగ్గా ఆడుతున్నాడు. రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించాడు. కానీ, తనకు లభించన స్టార్ట్‌ను ఉపయోగించుకుని లాంగ్ ఇన్నింగ్స్ ఆడటంలో మాత్రం విఫలం అవుతున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా తమ స్థాయికి తగ్గట్లు ఆడాల్సిన పరిస్థితి. ఆల్‌రౌండర్లలో శివమ్ దూబే మూడో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో రియాన్ పరాగ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.
ఇక కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టి.. రిషభ్ పంత్‌ను చివరి వన్డే ఆడించే అవకాశం ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తూ.. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌ను ముందు దింపాల్సి వస్తుంది. వాళ్లు విఫలం అవుతున్నారు ఇక డౌన్ ది ఆర్డర్‌లో వచ్చి శ్రేయస్ అయ్యర్ కూడా సరిగ్గా ఆడటం లేదు. వీటన్నింటికి పంత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడమే పరిష్కారంగా రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రెండు మార్పులతో టీమిండియా మూడో వన్డేలో బరిలోకి దిగొచ్చు.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.
What a sensational victory for the Lions! 🦁 Our bowlers, led by the incredible Jeffrey Vandersay, roared back to dismiss India for 208.
We take the lead in the ODI series 1-0. The fight is on! 💪 #SLvIND pic.twitter.com/AfaILjvW7R
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 4, 2024