Nidhan
India vs Sri Lanka: శ్రీలంక టూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. ఇప్పుడు కష్టాల్లో పడింది. టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్ కోసం ఫైట్ చేస్తోంది.
India vs Sri Lanka: శ్రీలంక టూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. ఇప్పుడు కష్టాల్లో పడింది. టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్ కోసం ఫైట్ చేస్తోంది.
Nidhan
శ్రీలంక టూర్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. ఇప్పుడు కష్టాల్లో పడింది. టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్ కోసం ఫైట్ చేస్తోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మొదటి వన్డే టై అయింది. ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగా విజయపు అంచుల దాకా వచ్చి ఆగిపోయింది రోహిత్ సేన. సెకండ్ వన్డేలో కూడా బ్యాటింగ్ వైఫ్యలం కారణంగా ఓటమి పాలైంది. సిరీస్‌లో ఇంకో మ్యాచ్ ఉంది. ఇందులో నెగ్గితే సిరీస్ సమం అవుతుంది లేదంటే లంక వశమవుతుంది. అందుకే మూడో వన్డేలో తమ సర్వశక్తులూ ఒడ్డాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. లంకను పడగొట్టాలని అనుకుంటున్నారు.
వన్డే సిరీస్‌లో భారత్‌కు వరుస షాక్‌లు తగలడానికి బ్యాటర్ల ఫెయిల్యూర్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే సరిగ్గా గమనిస్తే ఆరో బౌలర్ లేకపోవడం కూడా టీమ్‌కు మైనస్‌గా మారింది. సిరాజ్, అర్ష్‌దీప్ రూపంలో ఇద్దరు పేసర్లు.. సుందర్, అక్షర్, కుల్దీప్ రూపంలో ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లు టీమ్‌లో ఉన్నారు. కానీ బ్యాటింగ్ చేస్తూ ఐదారు ఓవర్లు వేయగలిగే ప్రాపర్ ఆల్‌రౌండర్ జట్టులో లేడు. అందుకే రోహిత్ శర్మ, శివమ్ దూబె, శుబ్‌మన్ గిల్‌తో బౌలింగ్ చేయిస్తున్నాడు కోచ్ గంభీర్. సరైన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. వీళ్లు అంత ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయడం లేదు. ఈ విషయంపై న్యూజిలాండ్ లెజెండ్ స్కాట్ స్టైరిస్ రియాక్ట్ అయ్యాడు. హిట్‌మ్యాన్‌ను ఆరో బౌలర్‌గా వాడుకోవాలనే గౌతీ ఆలోచన కరెక్ట్ కాదన్నాడు.
ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం రోహిత్‌ను నమ్ముకోవడం వేస్ట్ అని.. బంతితో అతడు అంతగా ప్రభావం చూపించడం లేదన్నాడు స్టైరిస్. ఈ విషయంలో గంభీర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నాడు. సిక్స్త్ బౌలర్‌గా సరైనోడ్ని దింపాలని.. ఇలాగైతే టీమ్‌కు కష్టమేనని హెచ్చరించాడు. వన్డేల్లో ఆరో బౌలర్ ఉండటం జట్టుకు ఎంతో ముఖ్యమని.. కాబట్టి ఈ రోల్ కోసం బెస్ట్ ఆప్షన్‌ను వెతకడంపై ఫోకస్ చేయాలని సూచించాడు. ఇక, గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి ఆరో బౌలర్ మీదే ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్‌ను బౌలింగ్‌కు దింపాడు. వాళ్లు సక్సెస్ అయ్యారు. కానీ వన్డే సిరీస్‌లో మాత్రం రోహిత్, గిల్ బౌలింగ్ చేసినా వర్కౌట్ కావడం లేదు. అందుకే స్టైరిస్ దీనిపై మరింతగా దృష్టి పెట్టాలని అన్నాడు. మరి.. స్టైరిస్ చెప్పినట్లు రోహిత్ ఆరో బౌలర్‌గా పనికిరాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Who will be the 6th bowling option for India in the 3rd and the final ODI against Sri Lanka? #ScottStyris #RohitSharma #Indiancricket #SLvsIND #Insidesport #CricketTwitter pic.twitter.com/OrDPhsYhar
— InsideSport (@InsideSportIND) August 5, 2024