Zubin Bharucha: లంక చేతిలో టీమిండియా ఓటమికి మనోడే కారణం.. ఎవరీ జుబిన్ భరూచా?

India vs Sri Lanka: టీమిండియా మరోమారు చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశపర్చింది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్​ను సమర్పించుకుంది.

India vs Sri Lanka: టీమిండియా మరోమారు చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశపర్చింది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్​ను సమర్పించుకుంది.

టీమిండియా మరోమారు చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశపర్చింది. లంకతో జరిగిన మూడో వన్డేలో ఓడి సిరీస్​ను సమర్పించుకుంది. తొలి వన్డే టై కాగా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టు నెగ్గింది. దీంతో సిరీస్ డిసైడర్​గా మారిన ఆఖరి వన్డేలో తప్పక గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రోహిత్ సేన.. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. బ్యాటర్ల వైఫల్యం టీమ్​ను తీవ్రంగా దెబ్బతీసింది. కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప సిరీస్​లో మిగతా బ్యాటర్లంతా ఫెయిలయ్యారు. బౌలర్లు కూడా లంక కండీషన్స్​ను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం జట్టుకు బిగ్ మైనస్​గా మారింది. అయితే మెన్ ఇన్ బ్లూ ఓటమికి మరో కారణం కూడా ఉంది.

లంక సిరీస్​లో భారత్​ ఓటమికి మనోడే కారణమని చెప్పాలి. ఆతిథ్య జట్టుకు కోచింగ్ ఇచ్చి భారత్ ఓటమికి కారణంగా మారిన అతడి పేరు జుబిన్ భరూచా. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోని రాజస్థాన్ రాయల్స్​ జట్టుకు డైరెక్టర్ ఆఫ్ హై-పెర్ఫార్మెన్స్​గా ఉన్న జుబిన్​ సేవల్ని భారత సిరీస్ కోసం వాడుకుంది లంక. రాజస్థాన్ జట్టుకు డైరెక్టర్ ఆఫ్​ క్రికెట్​గా ఉన్న కుమార సంగక్కర కోరిక మేరకు లంక జట్టుకు వారం రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు జుబిన్. ఈ సిరీస్​కు ముందు ఆ టీమ్ బ్యాటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. మంచి స్టార్ట్ దొరికితే దాన్ని భారీ స్కోరుగా ఎలా మలచాలి? చిన్న చిన్న భాగస్వామ్యాలతో మ్యాచ్​ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? టెయిలెండర్స్ రాణించడం టీమ్​కు ఎంత ప్లస్ అవుతుంది లాంటి విషయాలకు వాళ్లకు అర్థమయ్యేలా వివరించాడు.

జుబిన్ కోచింగ్ బాగా వర్కౌట్ అయింది. లంక ఓపెనర్లు పతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండోతో పాటు కుశాల్ మెండిస్ లాంటి వాళ్లు ఈ సిరీస్​లో రాణించారు. దునిత్ వెల్లలాగే లాంటి బౌలర్లు బ్యాట్​తోనూ రాణించడం ఆ టీమ్​కు బిగ్ ప్లస్ అయింది. ఇదే విషయాన్ని ఆ జట్టు తాత్కాలిక కోచ్ జయసూర్య బయటపెట్టాడు. ‘రాజస్థాన్ టీమ్ నుంచి జుబిన్​ను తీసుకొచ్చాం. అతడు జట్టుతో పాటే ఉండి 7 రోజుల పాటు కోచింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాడు. అక్కడ మా ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. భారీ ఇన్నింగ్స్​లు ఆడటం, ఎక్కువ సేపు క్రీజులో నిలబడటం ఎలాగో తెలుసుకున్నారు. వాళ్లలో జుబిన్ కాన్ఫిడెన్స్ నింపాడు’ అని జయసూర్య చెప్పుకొచ్చాడు. ఇక, ఇదే జుబిన్ టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్​ను తీర్చిదిద్దాడు. అతడికి కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణను ఇచ్చి సానబెట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్​తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్​లోనూ జైస్వాల్ తన మార్క్ చూపించాడు.

Show comments