iDreamPost
android-app
ios-app

స్పిన్‌ను బాగా ఆడే భారత ఆటగాళ్లు లంకలో ఎందుకు తేలిపోయారు?

  • Published Aug 08, 2024 | 1:03 PM Updated Updated Aug 08, 2024 | 1:03 PM

IND vs SL, Spin Bowling, Virat Kohli: శ్రీలంకతో సిరీస్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం.. స్పిన్‌ను సరిగ్గా ఆడలేకపోవడం. మరి భాతర బ్యాటర్లు స్పిన్‌ ఆడటంలో ఎందుకు విఫలం అయ్యారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

IND vs SL, Spin Bowling, Virat Kohli: శ్రీలంకతో సిరీస్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం.. స్పిన్‌ను సరిగ్గా ఆడలేకపోవడం. మరి భాతర బ్యాటర్లు స్పిన్‌ ఆడటంలో ఎందుకు విఫలం అయ్యారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  • Published Aug 08, 2024 | 1:03 PMUpdated Aug 08, 2024 | 1:03 PM
స్పిన్‌ను బాగా ఆడే భారత ఆటగాళ్లు లంకలో ఎందుకు తేలిపోయారు?

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ భారత జట్టుకు భారీ షాకిచ్చింది. టీ20ల్లో యంగ్‌ టీమిండియా చేతిల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌ అయిన లంక జట్టు.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి హేమాహేమీలున్న జట్టును వన్డే సిరీస్‌లో 2-0తో ఓడించింది. ఓడిపోవాల్సిన తొలి వన్డేను టై చేసి.. చివరి రెండు వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో భారత్‌ను మట్టికరిపించింది. ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్‌ ఆడటంలోనే దారుణంగా విఫలం అయింది. బ్యాటింగ్‌ వైఫల్యంతోనే సిరీస్‌ ఓటమిని చవిచూసింది రోహిత్‌ సేన. నిజానికి ఉపఖండపు జట్లన్నీ స్పిన్‌ను బాగానే ఆడుతాయి. భారత ఆటగాళ్లు కెరీర్‌ ఆరంభం నుంచే క్వాలిటీ స్పిన్‌ను ఆడటం అలవాటు చేసుకుంటారు. డొమెస్టిక్‌ క్రికెట్‌లో కూడా ఎంతో మంది క్వాలిటీ స్పిన్నర్లను ఎదుర్కొంటారు.

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ లాంటి జట్లు మాత్రమే ఉపఖండపు పిచ్‌లపై స్పిన్‌ను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడతాయి. కానీ, ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు కూడా లంక స్పిన్‌ను ఎదుక్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే లంక స్పిన్‌ ఎటాక్‌కు భారత బ్యాటింగ్‌ సాగిలపడింది. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర​, విరాట్‌ కోహ్లీ, శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే లాంటి ఆటగాళ్లు స్పిన్‌ను బాగా ఆడతారనే పేరు ఉంది. కోహ్లీ ఒక్కడే గతం కొంత కాలంగా స్పిన్‌ బౌలింగ్‌లో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ స్పిన్‌ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అవ్వడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి. కోహ్లీ ఒక్కడే కాదు.. మిగతా బ్యాటర్లు కూడా స్పిన్‌ ముందు చేతులెత్తేశారు.

అవే పిచ్‌లపై శ్రీలంక బ్యాటర్లు మెరుగ్గానే బ్యాటింగ్‌ చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్‌ను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కుల్దీప్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ లాంటి స్పిన్నర్లు కూడా లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. ఎందుకంటే.. లంక బ్యాటర్లు స్పిన్‌ను.. స్వీప్‌ షాట్లు, స్వ్కైర్‌ ఆఫ్‌ వికెట్‌ షాట్లు ఎక్కువ ఆడారు. అందుకే వాళ్లు సక్సెస్‌ అయ్యారు. కానీ భారత బ్యాటర్లలో చాలా మంది స్వీప్‌ షాట్లు ఆడలేదు, అలాగే స్క్వైర్‌ ఆఫ్‌ ది వికెట్‌ షాట్లు కూడా ఆడలేదు. ప్రస్తుతం టీమిండియాలో స్వీప్‌ షాట్లు బాగా ఆడే బ్యాటర్‌ రోహిత్‌ శర్మ ఒక్కడే. సూర్య కూడా స్వీప్‌ షాట్లు బాగా ఆడతాడు కానీ, అతను టీమ్‌లో లేడు. స్పిన్‌ను కట్‌ చేయాలన్న, ట్యాకిల్‌ చేయాలన్నా.. స్వీప్‌ షాట్లు ఆడటం ఎంతో ముఖ్యం. ఈ సిరీస్‌లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం స్వీప్‌ షాట్లు ఆడలేకపోవడమే. ఇదే విషయాన్ని రోహిత్‌ శర్మ కూడా ప్రస్తావించాడు. మేం ఆడాల్సినన్ని స్వీప్‌ షాట్లు ఆడలేకపోయాం అని పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.