iDreamPost
android-app
ios-app

IND vs SA: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన కలిస్.. అంత సీన్ లేదంటూ..!

  • Author singhj Published - 02:34 PM, Fri - 8 December 23

సౌతాఫ్రికా టూర్​కు వెళ్లిన టీమిండియా లెజెండరీ ఆల్​రౌండర్ జాక్వస్ కలిస్ వార్నింగ్ ఇచ్చాడు. భారత టీమ్​కు అంత సీన్ లేదన్నాడు.

సౌతాఫ్రికా టూర్​కు వెళ్లిన టీమిండియా లెజెండరీ ఆల్​రౌండర్ జాక్వస్ కలిస్ వార్నింగ్ ఇచ్చాడు. భారత టీమ్​కు అంత సీన్ లేదన్నాడు.

  • Author singhj Published - 02:34 PM, Fri - 8 December 23
IND vs SA: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన కలిస్.. అంత సీన్ లేదంటూ..!

వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫస్ట్ ఫారెన్ టూర్​కు టీమిండియా రెడీ అయిపోయింది. అదే సౌతాఫ్రికా పర్యటన. దాదాపు నెల రోజుల పాటు సఫారీ గడ్డ మీద అన్ని ఫార్మాట్లలోనూ అక్కడ సిరీస్​లో ఆడనుంది భారత్. క్రికెట్​ ఫ్యాన్స్​కు తమ ఆటతీరుతో మస్త్ ఎంటర్​టైన్​మెంట్​ను పంచేందుకు రెడీ అయిపోయింది. అయితే ఈ సిరీస్​లో గెలుపోటముల సంగతి పక్కనబెడితే.. టీమిండియాకు, ప్లేయర్లకు ఈ టూర్ ఎంతో కీలకం కానుంది. డిసెంబర్ 10న మొదలయ్యే ఈ పర్యటన జనవరి 7వ తేదీన ముగియనుంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

పొట్టి సిరీస్​కు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్ట్ సిరీస్​కు రోహిత్ శర్మను కెప్టెన్లుగా నియమించారు సెలక్టర్లు. లిమిటెడ్ ఓవర్స్ నుంచి హిట్​మ్యాన్​తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమి రెస్ట్ తీసుకున్నారు. గాయంతో బాధపడుతున్న షమి టెస్ట్ సిరీస్​లో ఆడటం కూడా డౌట్​గా మారింది. వన్డే, టీ20 స్క్వాడ్​లో సెలక్ట్ అయిన పేసర్ దీపక్ చాహర్ కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడు. తన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండటంతో సిరీస్ మధ్యలో టీమ్​తో జాయిన్ కానున్నాడు. ఈ టూర్​లో ముఖ్యంగా టీ20 సిరీస్​కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.

jacque kalis shocking comments on india team

వచ్చే ఏడాది జూన్​లో పొట్టి ఫార్మాట్​లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో టీమ్ కాంబినేషన్​పై ఓ అంచనాకు రావాల్సి ఉంది. అందుకు ఈ సిరీస్ కొంత హెల్ప్ అవుతుంది. తమకు వచ్చిన ఛాన్స్​ను యూజ్ చేసుకునేందుకు యంగ్​స్టర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-సౌతాఫ్రికా సిరీస్​పై లెజెండరీ ఆల్​రౌండర్ జాక్వస్ కలిస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ టూర్​ టీమిండియాకు చాలా కష్టమైందని.. ఇక్కడ నెగ్గడం అంత ఈజీ కాదని స్వీట్​ వార్నింగ్ ఇచ్చాడు. సౌతాఫ్రికాను వాళ్ల సొంత గడ్డ మీద ఓడించడం చాలా కష్టమని కలిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

jacque kalis shocking comments on india team

‘ప్రస్తుత భారత క్రికెట్ టీమ్ చాలా బాగుంది. కానీ సౌతాఫ్రికాను సౌతాఫ్రికాలో ఓడించడం చాలా కష్టం. ముఖ్యంగా టెస్టుల్లో మా టీమ్​ను అంత ఈజీగా ఓడించలేరు. సెంచూరియన్ గ్రౌండ్ సఫారీ జట్టుకు బాగా సరిపోతుంది. కేప్​టౌన్ మాత్రం టీమిండియాకు అనుకూలంగా ఉండొచ్చు. ఈ టెస్ట్ సిరీస్​ హోరాహోరీగా సాగడం ఖాయం’ అని కలిస్ చెప్పుకొచ్చాడు. సొంతగడ్డపై సౌతాఫ్రికాను ఓడించేంత సీన్ లేదన్నాడు. రీసెంట్​గా జరిగిన వన్డే వరల్డ్ కప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం మీదా ఈ గ్రేట్ ఆల్​రౌండర్ రియాక్ట్‌ అయ్యాడు. బడా టోర్నీల్లో నెగ్గాలంటే కాస్త అదృష్టం కూడా తోడవ్వాలని తెలిపాడు. లక్ ఫ్యాక్టర్ చాలా కీలకమన్నాడు. మరి.. సౌతాఫ్రికాను భారత్ ఓడించడం కష్టమేనని కలిస్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Tripti Dimri: ఆ టీమిండియా క్రికెటర్ అంటే చచ్చేంత ఇష్టం అంటున్న ‘యానిమల్’ బ్యూటీ!