Somesekhar
India-England 2nd Test Highlights: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలిరోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. భారత్ పరుగులు సాధిస్తే.. ఇంగ్లాండ్ వికెట్లు కూల్చింది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి హైలెట్స్ ఓసారి పరిశీలిద్దాం.
India-England 2nd Test Highlights: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో తొలిరోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. భారత్ పరుగులు సాధిస్తే.. ఇంగ్లాండ్ వికెట్లు కూల్చింది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి హైలెట్స్ ఓసారి పరిశీలిద్దాం.
Somesekhar
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో తొలి విజయం సాధించి భారత్ కు ఊహించన షాకిచ్చింది పర్యటక టీమ్. తొలి మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రెండో టెస్ట్ బరిలోకి దిగింది భారత్. విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలిరోజు టీమిండియా పై చేయి సాధించింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ భారీ శతకంతో కదంతొక్కడంతో.. భారీ స్కోర్ నమోదుచేసింది. ఇక ఈ మ్యాచ్ లో తొలిరోజు హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రెండో టెస్ట్ లో ఎలాగైనా ఇంగ్లాండ్ పై విజయం సాధించి, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది టీమిండియా. అదే కసిని ఈ మ్యాచ్ లో తొలిరోజు చూపించింది. గత మ్యాచ్ కు భిన్నంగా టీమిండియా ఆటగాళ్లు తమ ఆటతో మెప్పించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు అంత గొప్ప ఆరంభమేమీ లభించలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తూ.. కేవలం 14 పరుగులకు ఔటైయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో హైలెట్స్ గురించి మాట్లాడుకుంటే.. తొలిరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు యశస్వీ జైస్వాల్.
ఫస్ట్ డే మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 179 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జైస్వాల్ ఏకంగా సిక్సర్ తో సెహ్వాగ్ స్టైల్లో సెంచరీ చేయడం విశేషం. ఈ క్రమంలోనే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు ఈ కుర్ర బ్యాటర్. 2011 నుంచి టెస్టుల్లో తొలిరోజు అత్యధిక పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. దాంతోపాటుగా 2023-2025 టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రెండు శతకాలు బాదిన కోహ్లీ, రోహిత్ వల్ల కానిది సాధించి చూపించాడు. ఇదిలా ఉండగా.. మిగతా టీమిండియా ఆటగాళ్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి క్రీజ్ లో నిలవలేకపోయారు. గత మ్యాచ్ లో సంచలన ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హర్ట్లీ తొలిరోజు తేలిపోయాడు. అతడిని సునాయసంగా ఎదుర్కొన్నారు భారత బ్యాటర్లు. 20 ఏళ్ల అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా రోహిత్ శర్మనే బోల్తా కొట్టించడం మ్యాచ్ కు హైలెట్.
ఇక మ్యాచ్ ముగుస్తుంది అనగా.. అంపైర్ తో గొడవకు దిగాడు రవిచంద్రన్ అశ్విన్. వెలుతురు సరిగ్గా లేకున్నా.. అదనంగా ఓవర్ వేయించడంతో అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. తొలిరోజు రెండు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. టీమిండియా 336 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ 6 వికెట్లను నేలకూల్చింది. ప్రస్తుతం క్రీజ్ లో సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్(179), రవిచంద్రన్ అశ్విన్(5) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డెబ్యూ స్పిన్నర్ షోయబ్ బషీర్, రెహన్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు.
Yashasvi Jaiswal is the first batter to score 2 hundreds in WTC 2023-25.
– Jaiswal is here to rule. 🔥🫡 pic.twitter.com/gios0hHsCw
— Johns. (@CricCrazyJohns) February 2, 2024
ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్ అరుదైన ఘనత.. రోహిత్, కోహ్లీ వల్ల కానిది సాధించాడు!