వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేక తమ ప్రాణాలను వదులుతున్నారు క్రికెట్ లవర్స్. ఇప్పటికే ఏపీకి చెందిన ఓ ఐటీ ఉద్యోగి, అసోం కు చెందిన ఓ ఐటీఐ విద్యార్థి ప్రాణాలు వదిలిన విషాద సంఘటనలు మనకు తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు యువకులు టీమిండియా ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేక తమ ప్రాణాలను వదులుతున్నారు క్రికెట్ లవర్స్. ఇప్పటికే ఏపీకి చెందిన ఓ ఐటీ ఉద్యోగి, అసోం కు చెందిన ఓ ఐటీఐ విద్యార్థి ప్రాణాలు వదిలిన విషాద సంఘటనలు మనకు తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు యువకులు టీమిండియా ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రపంచ కప్ ఆరంభం నుంచి అద్భుతమై ప్రదర్శన కనబరుస్తూ.. ఫైనల్లోకి దూసుకొచ్చింది టీమిండియా. ఇక తుది సమరంలోనూ అదే జోరును కొనసాగించి.. కంగారూలను కంగారు పెట్టి వరల్డ్ కప్ టైటిల్ సాధిస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు భారత అభిమానులు. కానీ వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఇక ఈ ఓటమిని జీర్ణించుకోలేక తమ ప్రాణాలను వదులుతున్నారు క్రికెట్ లవర్స్. ఇప్పటికే ఏపీలోని తిరుపతికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి, అసోం కు చెందిన ఓ ఐటీఐ విద్యార్థి ప్రాణాలు వదిలిన విషాద సంఘటనలు మనకు తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు టీమిండియా ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమిని తట్టుకోలేక తమ ప్రాణాలను తీసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇప్పటికే తిరుపతికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి మ్యాచ్ చూస్తూ.. గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అదీకాక అసోం రాష్ట్రానికి చెందిన ఓ ఐటీఐ స్టూడెంట్ మ్యాచ్ ఓడిపోవడంతో.. తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన మరచిపోకముందే.. మరో రెండు గుండెలు పగిలే ఘటనలు నమోదు అయ్యాయి. టీమిండియా ఫైనల్లో ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బంకురా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల రాహుల్ లోహర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భారత్ మ్యాచ్ ఓడిపోవడంతో.. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తన రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాహుల్ లోహర్. ఈ విషాద ఘటన స్థానికుల గుండెలను పిండేసింది. కాగా.. ఒడిశా రాష్ట్రం జైపూర్ కు చెందిన దేవ్ రంజన్ దాస్ కూడా భారత ఓటమినిక తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవ్ రంజన్ దాస్ గత కొంతకాలంగా “ఎమోషనల్ డిసార్డర్ సిండ్రోమ్” అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అతడి మామయ్య పోలీసులకు తెలిపాడు. ఈ రెండు సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.