Nidhan
India vs Zimbabwe: భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో బంపర్ విక్టరీ కొట్టిన యంగ్ ఇండియా అరుదైన ఘనతను అందుకుంది. వరల్డ్ క్రికెట్లో ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
India vs Zimbabwe: భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో బంపర్ విక్టరీ కొట్టిన యంగ్ ఇండియా అరుదైన ఘనతను అందుకుంది. వరల్డ్ క్రికెట్లో ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Nidhan
భారత జట్టు చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బంపర్ విక్టరీ కొట్టిన యంగ్ ఇండియా అరుదైన ఘనతను అందుకుంది. వరల్డ్ క్రికెట్లో ఏకైక జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఇవాళ జరిగిన మూడో టీ20లో విక్టరీ కొట్టింది భారత్. 23 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఓ ఫీట్‌ను నమోదు చేసింది. టీ20 హిస్టరీలో 150 విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా మెన్ ఇన్ బ్లూ నిలిచింది.
మూడో టీ20లో గెలుపుతో పొట్టి ఫార్మాట్లో 150 విజయాలు అందుకున్న తొలి జట్టుగా ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది టీమిండియా. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఈ న్యూస్ విని మరింత సంతోషపడుతున్నారు. మన జట్టుకు ఢోకా లేదని అంటున్నారు. ఇక, మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేన.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. సిరీస్‌లో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నాలుగో టీ20లో నెగ్గితే సిరీస్ భారత్ వశమవుతుంది. మరి.. టీమిండియా ఆల్‌టైమ్ రికార్డ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
India becomes the first team to complete 150 wins in T20I history 🇮🇳
– The best team in the world….!!! pic.twitter.com/5mNRzckRBZ
— Johns. (@CricCrazyJohns) July 10, 2024