iDreamPost
android-app
ios-app

పాండ్యాను వెంటాడిన దురదృష్టం! అది ఔటా? నాటౌటా? వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 03:57 PM, Fri - 28 July 23
  • Author Soma Sekhar Published - 03:57 PM, Fri - 28 July 23
పాండ్యాను వెంటాడిన దురదృష్టం! అది ఔటా? నాటౌటా? వీడియో వైరల్..

ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ లో ఉన్న టీమిండియా దుమ్మురేపుతోంది. తొలుత టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేద్దామని చూసిన టీమిండియాకు వరుణుడు అడ్డుతగిలాడు. ఇక టెస్ట్ సిరీస్ లో చూపిన దూకుడునే వన్డే సిరీస్ లో ప్రదర్శిస్తోంది భారత జట్టు. బార్బడోస్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్ పై 5 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. 115 పరుగల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా.. ఈ మ్యాచ్ లో భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. ఊహించని రీతిలో పాండ్యా రనౌట్ గా వెనుదిరిగాడు. అయితే అది ఔటా? నాటౌటా? అన్న దానిపై ఇప్పటికీ చర్చజరుగుతూనే ఉంది.

వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు చర్చంతా.. హార్దిక్ పాండ్యా రనౌట్ గురించే. వివరాల్లోకి వెళితే.. భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. విండీస్ స్పిన్నర్ యాన్నిక్ కరియా బౌలింగ్ లో ఇషాన్ కిషన్ భారీ షాట్ కొట్టాడు. కానీ బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బాల్ స్ట్రైట్ గా బౌలర్ చేతుల్లోకి వెల్లింది. కానీ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో బాల్ మిస్ అయ్యి నేరుగా నాన్ స్ట్రైకర్స్ ఎండ్ లో స్టంప్స్ ను తాకింది. అప్పుడు నాన్ స్ట్రైకర్స్ ఎండ్ లో ఉన్న పాండ్యా క్రీజ్ నుంచి ముందుకు వచ్చినట్లు అన్పించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు.

ఈ క్రమంలోనే రిప్లే చెక్ చేయగా.. తొలుత హార్దిక్ చేరుకున్నాడు. కానీ బెయిల్స్ పడినప్పుడు మాత్రం బ్యాట్ గాల్లో ఉంది. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ పాండ్యాను రనౌట్ గా ప్రకటించాడు. దాంతో కేవలం 5 పరుగులకే నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది పాండ్యా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పాండ్యా ఔట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యాది నాటౌట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దానికి కారణం ఐసీసీ న్యూ రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ రన్ తీసే క్రమంలో డైవ్ కొడుతూ బ్యాట్ ను ముందుగా ఒకసారి గ్రౌండ్ ను తాకి ఉంచితే చాలు. అతడు నాటౌట్ గానే పరిగణించబడతాడు. ఆ తర్వాత అదే బ్యాట్ ను గాలిలో ఉంచినప్పటికీ తొలుత బ్యాట్ పెట్టిన దాన్నే పరిగణలోకి తీసుకోవాలి. కానీ హార్దిక్ విషయంలో ఇలా జరగలేదు. విండీస్ కు ఫేవర్ గా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాంతో పాండ్యా అవుట్ కాక తప్పలేదు. మరి పాండ్యా ఔటా? నాటౌటా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.