iDreamPost

కెప్టెన్ పాండ్యాపై ప్రశంసలు.. మీరు మారిపోయార్ సార్ అంటూ..!

కెప్టెన్ పాండ్యాపై ప్రశంసలు.. మీరు మారిపోయార్ సార్ అంటూ..!

టీమిండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ 2023లో టీమిండియా గాడిలో పడినట్లే ఉంది. టెస్టు, వన్డే సిరీస్ లో కైవసం చేసుకున్న ఇండియా.. టీ20 సిరీస్ మాత్రం మొదటి రెండు మ్యాచుల్లో తడబడింది. ఆ తర్వాత ఇప్పుడు వరుసగా 3, 4 మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హార్దిక్ సేన ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో సిరీస్ పై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. 4వ టీ20 మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో జైశ్వాల్, శుభ్ మన్ గిల్ చెలరేగారు.. కానీ, నెటిజన్స్ మాత్రం కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కూడా చేయలేదు.. కేవలం ఒకే ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. కానీ, నెటిజన్స్ అంతా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ప్రశంలు కురిపిస్తున్నారు. అయితే పెద్దగా పర్ఫార్మ్ చేసింది ఏమీ లేదు కాదా.. మరి ఎందుకు అంతలా పొగుడుతున్నారు అనుకోకండి. హార్దిక్ పాండ్యా ఏం చేయలేదు కాబట్టే అతడిని పొగుడుతున్నారు. సాధారణంగా కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యాపై చాలానే విమర్శలు ఉన్నాయి. అలాంటి విమర్శలకు తగ్గట్లుగానే అతని నిర్ణయాలతో గెలవాల్సిన మ్యాచుల్లో పరాజయం పాలవడం కూడా చూశాం. కానీ, ఈసారి అలాంటి తప్పులు ఏం చేయకుండా హార్దిక్ పాండ్యా అసలు సిసలైన కెప్టెన్సీని కనబరచాడు. హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. విండీస్ బ్యాటర్లపై అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

వేసిన ఒకే ఒక ఓవర్లో 14 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అతని ఏకానమీనే ఎక్కువ.  అది గ్రహించిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత అస్సలు బౌలింగ్ చేయలేదు. తాను తప్పుకుని ముఖేష్, అక్షర్, అర్షదీప్, చాహల్, కుల్దీప్ లకు మాత్రమే బౌలింగ్ ఇచ్చాడు. ఈ నిర్ణయం వల్లే స్కోర్ బోర్డు పరుగులు పెట్టలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 30, 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకోలేదు అనుకుంట. ఇంకొక కారణం ఏంటంటే.. మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చేసి హార్దిక్ పాండ్యా ముందు బ్యాటింగ్ కి వస్తాడు అని అపవాదు ఉంది. కానీ, ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అలాంటి ప్రయోగం చేయలేదు. జైశ్వాల్, శుభ్ మన్ గిల్, తిలక్ వర్మలకే ప్రాధాన్యం ఇచ్చాడు. తాను బ్యాటింగ్ కి రావాలి అనుకోలేదు.

ఆ కారణం వల్లకూడా హార్దిక్ పాండ్యాను నెటిజన్స్ పొగిడేస్తున్నారు. గత మ్యాచ్ లో 49 బ్యాటింగ్ చేస్తున్న తిలక్ వర్మకు 50 చేసుకునే అవకాశం ఇవ్వకుండా సిక్స్ కొట్టాడని హార్దిక్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ 4వ టీ20 మ్యాచ్ తో ఆ విషయాన్ని మర్చిపోయి.. హార్దిక్ కెప్టెన్సీని పొగుడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే హార్దిక్ పాండ్యా తప్పకుండా మంచి కెప్టెన్ అవుతాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదు. టాపార్డర్ లో షాయ్ హోప్ మాత్రమే ఊహించిన స్థాయిలో రాణించగలిగాడు. అతడు కేవలం 29 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు.

మిడిలార్డర్ లో హెట్ మేయర్ టీమిండియా బౌలర్లకు కాసేపు చమటలు పట్టించాడు. కేవలం 39 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతను ఇంకాసేపు క్రీజ్ లో ఉంటే వెస్టిండీస్ కచ్చితంగా 200 పురుగుల మార్క్ ని దాటేసేది. టీమిండియా బౌలర్లు కట్టడి చేయడంతో.. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన యశస్వీ జైశ్వాల్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 84 పరుగులు చేశాడు. శుభ్ మన్ గిల్ 47 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. 5 టీ20ల సిరీస్ లో వెస్టిండీస్, భారత్ చెరో 2 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు జరగబోయే మ్యాచ్ లో గెలిస్తే టీ20 సిరీస్ ని కూడా భారత్ కైవసం చేసుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి