iDreamPost
android-app
ios-app

కెప్టెన్‌ కాకపోతే ఏంటి.. టీమిండియాలో అతనే లీడర్‌: బుమ్రా

  • Published Jul 26, 2024 | 12:52 PM Updated Updated Jul 26, 2024 | 12:52 PM

Virat Kohli, Jasprit Bumrah: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ భారత స్టార్‌ క్రికెటర్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Jasprit Bumrah: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ భారత స్టార్‌ క్రికెటర్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 26, 2024 | 12:52 PMUpdated Jul 26, 2024 | 12:52 PM
కెప్టెన్‌ కాకపోతే ఏంటి.. టీమిండియాలో అతనే లీడర్‌: బుమ్రా

తన అద్భుతమైన బౌలింగ్‌తో దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా. ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో బుమ్రా ఎలాంటి ప్రదర్శన చేశాడో అంతా చూశాం. ఫస్ట్‌ మ్యాచ్‌ నుంచి సూపర్‌ బౌలింగ్‌తో.. లో స్కోరింగ్‌ గేమ్స్‌లో కూడా టీమిండియాను తన బౌలింగ్‌తో గట్టెక్కించాడు. భారత జట్టు ఓటమి ఎరుగని జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకుందంటే.. అందుకు ప్రధాన కారణం బుమ్రా. ఈ విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే.. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బుమ్రా టీమిండియాలోని స్టార్‌ క్రికెటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ కాకపోయినా.. టీమిండియాలో అతనో లీడర్‌. కెప్టెన్సీ అనేది ఒక పోస్ట్‌.. కానీ, టీమ్‌ను లీడర్‌ లీడ్‌ చేస్తాడు. ఆట పట్ల అతనికుండే అంకిత భావం, అతని ఎనర్జీ.. తమను ఎప్పుడూ ఇన్స్‌పైర్‌ చేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో బుమ్రా చాలా కాలం పాటు ఆడాడు. కోహ్లీ తర్వాత.. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో రోహిత్‌ శర్మ కెప్టెన్‌ అయ్యాడు. ఇప్పుడు రోహిత్‌ స్థానంలో టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే.. కోహ్లీ కెప్టెన్‌ కాకపోయినా.. లీడర్‌గా ఉన్నాడని బుమ్రా పేర్కొన్నాడు. బుమ్రా-కోహ్లీ మధ్య మంచి బాండింగ్‌ ఉన్న విషయం తెలిసిందే.

అలాగే రోహిత్‌ శర్మ గురించి కూడా మాట్లాడిన బుమ్రా.. తాను ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చిన సమయంలో తనకు ఫీల్డ్‌ సెట్‌ గురించి కానీ, ఇంకా వేరే విషయాల గురించి కానీ పెద్దగా తనకు తెలియదని, ఆ సమయంలో రోహిత్‌ శర్మనే మొత్తం చూసుకునే వాడంటూ బుమ్రా వెల్లడించాడు. తాను ఈ బాల్‌ వేయబోతున్నాను అని మాత్రమే రోహిత్‌కు చెప్పేవాడినని, ఆ బాల్‌కు తడినట్లు.. ఫీల్డింగ్‌ను రోహిత్‌ శర్మనే సెట్‌ చేసుకునేవాడంటూ బుమ్రా పేర్కొన్నాడు. ఇలా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ గురించి మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి బుమ్రా చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.