IND vs SL ODI- Rohit Sharma Created Record As A Opener: శ్రీలంకపై రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. కెరీర్ లో అరుదైన ఘనత నమోదు!

శ్రీలంకపై రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. కెరీర్ లో అరుదైన ఘనత నమోదు!

IND vs SL ODI- Rohit Sharma Created Record As A Opener: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో విజృంభించాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించాడు.

IND vs SL ODI- Rohit Sharma Created Record As A Opener: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో విజృంభించాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా మైదానంలో ఎలాంటి బెరుకు లేకుండా బౌలర్లను చెండాడే హిట్ మ్యానే గుర్తొస్తాడు. ప్రపంచంలో ఉన్న మేటి బౌలర్లు అందరికీ తన సిక్సర్లతో చెమటలు పట్టిచేంశాడు. ఎంత గొప్ప బౌలర్ అయినా కూడా క్రీజులో రోహిత్ శర్మ ఉంటే కచ్చితంగా ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. అలాగే ఫీల్డర్లు ఆల్మోస్ట్ బౌండరీ మీదనే ఉంటారు. అలాంటి హిట్ మ్యాన్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే శ్రీలంక సిరీస్ లో తొలి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డు గురించి మాత్రం కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన బ్యాటర్లలో మొదట సచిన్ ఉండగా.. రెండో ప్లేస్ కి రోహిత్ వచ్చేశాడు.

శ్రీలంక టూర్ ఆఫ్ 2024లో భాగంగా తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత.. వన్డే మ్యాచ్ ని టీ20 రేంజ్ లో ఆడేశాడు. ప్రతి లంక బౌలర్ కు ముచ్చెమ్మటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 58 పరుగులు పూర్తి చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్ ను దునిత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేర్చాడు. ఈ మ్యాచ్ లో అర్ధ శతకం నమోదు చేయడం మాత్రమే కాకుండా.. రోహిత్ శర్మ ఓపెనర్ గా అరుదైన ఘనతను కూడా సాధించాడు.

రికార్డు ఏంటంటే?:

రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ప్రపంచ క్రికెట్ లో ఓపెనర్ గా 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 15 వేలు పరుగులు పూర్తి చేయడమే కాకుండా.. వరల్డ్ క్రికెట్ అత్యంత వేగంగా ఈ మైల్ స్టోన్ ని చేరుకున్న రెండో బ్యాటర్ గా రికార్డుల కెక్కాడు. 331 ఇన్నింగ్సుల్లో సచిన్ మొదటి ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత 351 ఇన్నింగ్సుల్లో రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. హిట్ మ్యాన్ తర్వాత ఈ జాబితాలో డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించడమే కాకుండా.. ఇలాంటి ఒక క్రేజీ రికార్డును నెలకొల్పి టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. మరి.. రోహిత్ శర్మ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments