Somesekhar
శ్రీలంకతో జరగబోయే తొలి వన్డే కోసం రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలా? అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. ఈ విషయంపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
శ్రీలంకతో జరగబోయే తొలి వన్డే కోసం రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలా? అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. ఈ విషయంపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
Somesekhar
ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా అదరగొడుతోంది. సూర్యకుమార్ సారథ్యంలో టీ20 సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుని సత్తాచాటింది. యంగ్ ప్లేయర్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు సీనియర్ల వంతు వచ్చింది. శుక్రవారం(ఆగస్ట్ 2) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. అయితే తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఓ సమస్య ఎదురైంది. తుది జట్టులోకి రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలా? అన్నది ఇప్పుడు పెద్ద టాస్క్. ఈ విషయంపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
టీమిండియా-శ్రీలంక మధ్య శుక్రవారం మధ్యాహ్నం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనుభవం ఉన్న రాహుల్ ను ఆడిస్తారా? యంగ్ ప్లేయర్ పంత్ కు స్థానం దక్కుతుందా? అని క్రికెట్ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ..”రాహుల్-పంత్ ఇద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టమే. ఎందుకంటే ఇద్దరు కూడా అద్భుతమైన ప్లేయర్లే. సమర్థులు పైగా మ్యాచ్ విన్నర్లు. ఇలాంటి వారిలో ఒకరినే ఎంపిక చేయాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కెప్టెన్ గా నాకు అనేక ఆప్షన్లు ఉంటాయి. కానీ ఈ విషయంలో మాత్రం నేను హెడ్ కోచ్ గంభీర్ తో మాట్లాడి, ఎవరిని తీసుకోవాలో ఆలోచిస్తాం. ప్రయోగాలు చేయడం కరెక్టే అయినప్పటికీ.. ఓటమి రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే మాత్రం.. మా ప్రయోగాలను విరమించుకుంటాం” అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.