iDreamPost
android-app
ios-app

Olympics 2024: మరికొన్ని రోజుల్లో ఈవెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన భారత స్టార్ ప్లేయర్!

  • Published Aug 02, 2024 | 7:55 AM Updated Updated Aug 02, 2024 | 7:55 AM

ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ఎన్నోకలలతో పారిస్ లో అడుగుపెట్టిన స్టార్ గోల్ఫర్ అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ఎన్నోకలలతో పారిస్ లో అడుగుపెట్టిన స్టార్ గోల్ఫర్ అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

Olympics 2024: మరికొన్ని రోజుల్లో ఈవెంట్.. రోడ్డు ప్రమాదానికి గురైన భారత స్టార్ ప్లేయర్!

పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు బరిలోకి దిగిన భారత క్రీడాకారులు అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ మూడు పతకాలు సాధించింది. ఈ మూడు కూడా షూటింగ్ లోనే రావడం విశేషం. ఓ ఒలింపిక్స్ లో ఎక్కువ ఒకే క్రీడలో ఎక్కువ పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఇక ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ఎన్నోకలలతో పారిస్ లో అడుగుపెట్టిన స్టార్ గోల్ఫర్ అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో సత్తాచాటేందుకు వెళ్లిన స్టార్ గోల్ఫర్ దీక్షా దగర్(23) కారు ప్రమాదానికి గురైంది. జులై 30న జరిగిన ఈ కారు ప్రమాదం గురించి ఆలస్యంగా తెలిసింది. ప్రమాద సమయంలో కారులో దీక్షతో పాటుగా ఆమె తల్లిదండ్రులు, సొదరుడు ఉన్నట్లు తెలుస్తోంది. దీక్ష, ఆమె తండ్రి క్షేమంగా బయటపడగా.. తీవ్ర గాయాలు అయిన ఆమె తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్వల్ప గాయాలతో సొదరుడు బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. ఈనెల 7న జరిగే గోల్ప్ ఈవెంట్ లో దీక్ష పాల్గొననుంది. ఇలాంటి సమయంలో ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం. డెఫ్లింపిక్స్, సాధారణ ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏకైక బధిర గోల్ఫర్ దీక్షనే కావడం విశేషం.