iDreamPost
android-app
ios-app

IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

  • Author Soma Sekhar Published - 01:49 PM, Sat - 9 December 23

సఫారీ టీమ్ తో జరగబోయే తొలి టీ20 పోరుకు ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్నది కోచ్ ద్రవిడ్ కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే జట్టులో ఎవరు స్థానం సంపాదించుకుంటారో ఓసారి పరిశీలిద్దాం.

సఫారీ టీమ్ తో జరగబోయే తొలి టీ20 పోరుకు ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్నది కోచ్ ద్రవిడ్ కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే జట్టులో ఎవరు స్థానం సంపాదించుకుంటారో ఓసారి పరిశీలిద్దాం.

  • Author Soma Sekhar Published - 01:49 PM, Sat - 9 December 23
IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే!

యంగ్ టీమిండియా ఉడుకు రక్తంతో ఉరకలేస్తోంది. ఇప్పటికే ఆసీస్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుని మంచి జోరుమీదుంది. ఇక ఇదే జోరును సఫారీ గడ్డపై కూడా చూపించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రోటీస్ గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టింది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా డిసెంబర్ 10(ఆదివారం)న జరగనుంది. సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటుగా మరికొందరు పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉన్న సంగతి తెసిందే. ఇక వరల్డ్ కప్ తర్వాత విరామం తీసుకున్న గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లో తిరిగి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో సఫారీ టీమ్ తో జరగబోయే తొలి టీ20 పోరుకు ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్నది కోచ్ ద్రవిడ్ కు తలనొప్పిగా మారింది.

టీమిండియా ప్రస్తుతం యువ క్రికెటర్లతో నిండి ఉంది. దాదాపు అందరూ అద్భుతంగా రాణిస్తున్న వారే. దీంతో సఫారీ టీమ్ తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కు ఎవరిని ఎంపిక చేయాలన్నది పెద్ద తలనొప్పిగా మారింది హెడ్ కోచ్ ద్రవిడ్ కు. వరల్డ్ కప్ తర్వాత జట్టులోకి వచ్చిన గిల్ తన ఓపెనర్ స్థానంలో దిగుతుండగా.. అతడికి జోడీగా యశస్వీ జైస్వాల్ ను దింపనున్నారు. దీంతో రుతురాజ్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక టాపార్డర్ లోని 3, 4 స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ బ్యాటింగ్ కు దిగుతారు. ఇక ఐదో ప్లేస్ కోసం హిట్టర్ జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్ లు పోటీ పడుతున్నారు. ఆసీస్ తో జరిగిన చివరి రెండు మ్యాచ్ ల్లో జితేశ్ తుపాన్ ఇన్నింగ్స్ లు ఆడిన విషయం తెలిసిందే.

team india playing 11

ఈ క్రమంలోనే వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ కు ప్రాధాన్యం ఇస్తే తప్ప అతడికి జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దానికి తోడు రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీ స్థానానికి అతడిని పరిశీలిస్తున్నారు సెలెక్టర్లు. ఇది దృష్టిలో పెట్టుకుంటే సఫారీతో తొలి టీ20కి అతడికి ఛాన్స్ దక్కొచ్చు. ఆరో స్థానంలో రింకూ సింగ్ ఫినిషర్ రోల్ పోషించడానికి రెడీగా ఉన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్, రవి బిష్ణోయ్ లు తుది జట్టులో ఉండనున్నారు. పేస్ బౌలింగ్ దళానికి హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. అర్షదీప్, ముకేష్ కుమార్ లు సిరాజ్ తో కలిసి పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. మరి పేస్ కు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్ లపై టీమిండియా యువ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.

టీమిండియా తుది జట్టు(అంచనా): యశస్వీ జైస్వాల్, శుబ్ మన్ గిల్, జితేశ్ శర్మ/ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, జడేజా, రవి బిష్ణోయ్, మఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్