iDreamPost
android-app
ios-app

ఇండియా-పాక్ మ్యాచ్.. హిస్టరీ రిపీట్ అన్న అక్తర్! ఆడేసుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్..

  • Author Soma Sekhar Published - 09:48 PM, Fri - 13 October 23
  • Author Soma Sekhar Published - 09:48 PM, Fri - 13 October 23
ఇండియా-పాక్ మ్యాచ్.. హిస్టరీ రిపీట్ అన్న అక్తర్! ఆడేసుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్..

వరల్డ్ కప్ లో చిరకాల ప్రతర్థులు తలపడబోతున్నారు. ఈ యుద్దాన్ని చూడటానికి రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇండియా-పాక్ హై వోల్డేజీ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్దమైంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ ను చూసిన టీమిండియా ఫ్యాన్స్ అతడి పరువు తీస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అక్తర్ ఏం పోస్ట్ చేశాడు? టీమిండియా అభిమానులు ఎందుకు ఫైర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఇండియా-పాక్ మధ్య జరగబోయే హోరాహోరీ పోరు కోసం ప్రపంచ దేశాలన్ని ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ను టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నారు. నిజం ఒప్పేసుకున్నందుకు థ్యాక్స్ బ్రో అంటూ సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే? ఇండియా-పాక్ మ్యాచ్ నేపథ్యంలో షోయబ్ అక్తర్ ఓ ట్వీట్ చేశాడు. అందులో “రేపు హిస్టరీ రిపీట్ అవుతుంది” అని వికెట్ తీసిన ఆనందంలో ఉన్న పిక్ ను షేర్ చేశాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ కు మండుకొచ్చింది.

హిస్టరీ రిపీట్ కామెంట్ ను హైలైట్ చేస్తూ.. మీ ఓటమిని ముందే ఊహించినందుకు థ్యాక్స్ బ్రో, నిజాలు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ మీమ్స్, ట్రోల్స్ తో అక్తర్ ను ఓ ఆటాడుకుంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా వన్డే వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియాను ఇప్పటి వరకు పాక్ ఓడించలేదు. ఇదే విషయాన్ని అక్తర్ కు గుర్తుచేస్తూ.. దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో తన పోస్ట్ ను అక్తర్ డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి అక్తర్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio