iDreamPost

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్!

  • Author Soma Sekhar Published - 09:09 PM, Fri - 13 October 23
  • Author Soma Sekhar Published - 09:09 PM, Fri - 13 October 23
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్!

562 మ్యాచ్ లు, 34, 045 పరుగులు.. అందులో 88 సెంచరీలు, 168 అర్దశతకాలు. ఈ గణాంకాలు చూస్తేనే తెలుస్తోంది అతడు ఎంత ప్రమాదకరమైన ఆటగాడో. అలాంటి ప్లేయర్ తాజాగా అలసిపోయానని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ గా, బ్యాటర్ గా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు 38 ఏళ్ల అలిస్టర్ కుక్. 17 పాటు ఇంగ్లాండ్ క్రికెట్ కు తన సేవలను అందించాడు. 2018లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన కుక్.. మెున్నటి దాక కౌంటీ మ్యాచ్ లు ఆడాడు. తాజాగా అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఓ క్రికెట్ దిగ్గజ శకం ముగిసిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికినప్పటికీ.. ఇంగ్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు కుక్. టెస్ట్ బ్యాటర్ గా ఇంగ్లాండ్ క్రికెట్ పైనే కాకుండా.. వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడు అలిస్టర్ కుక్. అదీకాక ఇంగ్లాండ్ తరపున టెస్టు ఫార్మాట్ లో 10 వేల రన్స్ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సాధించాడు.

కుక్ కెరీర్ విషయానికి వస్తే.. 161 టెస్ట్ ల్లో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలతో 12, 472 పరుగులు చేశాడు. ఇక 92 వన్డేల్లో 3204 పరుగులు చేయగా.. అందులో 5 సెంచరీలు, 19 అర్దశతకాలు ఉన్నాయి. 4టీ20ల్లో 61 రన్స్ చేశాడు. దేశవాళీ క్రికెట్ లో కుక్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. అతడు మెుత్తం 352 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 26,643 రన్స్ చేశాడు. ఇందులో 74 సెంచరీలు, 125 అర్దశతకాలు ఉండటం విశేషం. మరి అలిస్టర్ కుక్ రిటైర్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి