iDreamPost
android-app
ios-app

ఔట్ అవుతానని తెలిసినా రోహిత్ ఫాస్ట్ గా ఆడటానికి కారణం?

తొలి సెమీ ఫైనల్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై చెలరేగుతోంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అంత ఫాస్ట్ గా ఎందుకు బ్యాటింగ్ చేశాడు? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తొలి సెమీ ఫైనల్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై చెలరేగుతోంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అంత ఫాస్ట్ గా ఎందుకు బ్యాటింగ్ చేశాడు? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఔట్ అవుతానని తెలిసినా రోహిత్ ఫాస్ట్ గా ఆడటానికి కారణం?

వరల్ట్ కప్ 2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్ తో తలపడుతోంది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలి అంటే సెమీస్ లో కివీస్ పై పైచేయి సాధించాల్సిందే. ఇలాంటి కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి రోహిత్ భీకర ఫామ్ లో కనిపించాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా ఆడాడు. రోహిత్ బ్యాటింగ్ చూసి అంతా షాకయ్యారు. ఎందుకు ఇంత వేగంగా ఆడుతున్నాడు? వికెట్ పోతే ఏంటి పరిస్థితి? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదిలాయి. అయితే ఇక్కడ ఒక పక్కా వ్యూహంతోనే రోహిత్ అలా ఫాస్ట్ గా బ్యాటింగ్ చేశాడు.

వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటివరకు గెలిచింది ఒక లెక్క.. ఇవాళ కివీస్ తో జరిగే మ్యాచ్ ఒక లెక్క. టాస్ గెలిచిన వెంటనే ఇంక మ్యాచ్ టీమిండియాదే అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే రోహిత్ నిలకడ ఆడాలి.. శతకం కూడా చేయాలి అంటూ అభిమానులు ఆకాంక్షించారు. అయితే అందరి ఊహలకు అందకుండా క్రీజులోకి వచ్చింది మొదలు రోహిత్ ఫాస్ట్ గా బ్యాటింగ్ చేశాడు. 28 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగాడు. అయితే అర్ధశతకానికి అడుగు దూరంలో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. రోహిత్ అవుటయ్యాక అందరూ ఎందుకు ఇంత ఫాస్ట్ గా ఆడాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కెప్టెన్ గా రోహిత్ శర్మ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి కీలక మ్యాచ్ లో మిడిలార్డర్ మీద కచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఒకవేళ స్లోగా ఆడి రోహిత్ అవుటైతే ఆ బాధ్యత మొత్తం కోహ్లీ, మిగిలిన కుర్రాళ్ల మీద పడుతుంది. వాళ్లు గనుక ఒత్తిడిలో తప్పుడు షాట్లను ఎంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే రోహిత్ శర్మ వాళ్లు ఫ్రీగా ఆడాలి అనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాను గనుక స్పీడుగా పరుగులు చేస్తే తర్వాత వచ్చే ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఆడేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్ని గిల్ నిజం చేశాడు. రోహిత్ ఉన్నంతసేపు అటాకింగ్ బాధ్యత కెప్టెన్ కి ఇచ్చాడు. రోహిత్ పెవిలియన్ చేరిన తర్వాత గిల్ గేరు మార్చాడు. తన కెరీర్ లో 13వ వన్డే అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఒకవేళ రోహిత్ శర్మ లెక్క తప్పి ముదే అవుటై ఉన్నా కూడా గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉండనే ఉన్నారు. తన టీమ్ మీద ఉన్న నమ్మకం, కెప్టెన్ గా తన బాధ్యతను రోహిత్ శర్మ ఇలా నిర్వర్తించాడు. తాను అవుటవుతాను అని తెలిసి కూడా ఎంతో వేగంగా ఆడాడు. ఈ మ్యాచ్ లో వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ(50) నిలిచాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. 14 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి టీమిండియా 114 పరుగులు చేసింది. క్రీజులో శుభ్ మన్ గిల్(50*), కోహ్లీ(14*) బ్యాటింగ్ చేస్తున్నారు. టీమ్ కోసం రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.