World Cup: క్యాచ్ వదిలేసిన జడేజా.. అతడి వైఫ్​ రియాక్షన్ వైరల్!

  • Author singhj Published - 05:42 PM, Sun - 22 October 23

న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత జట్టు ఫీల్డింగ్​లో ఘోరంగా ఫెయిల్ అవుతోంది. అసలే వికెట్లు పడక ఇబ్బంది పడుతున్న దశలో క్యాచ్​లు మిస్ చేయడంతో బౌలర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత జట్టు ఫీల్డింగ్​లో ఘోరంగా ఫెయిల్ అవుతోంది. అసలే వికెట్లు పడక ఇబ్బంది పడుతున్న దశలో క్యాచ్​లు మిస్ చేయడంతో బౌలర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

  • Author singhj Published - 05:42 PM, Sun - 22 October 23

టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఈ మ్యాచ్​లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకోవడంతో కివీస్ బ్యాటింగ్​కు దిగింది. అయితే ఆ టీమ్​కు శుభారంభం దక్కలేదు. భారత పేసర్లు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ చేయడం వారికి కష్టమైంది. దీంతో షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు ఓపెనర్ డెవిన్ కాన్వే. కాన్వే ఔటైన కొద్దిసేపటికే విల్ యంగ్​ కూడా పెవిలియన్​కు చేరాడు. వరల్డ్ కప్​లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ షమి.. తాను వేసిన మొదటి బాల్​కే వికెట్ తీశాడు.

19 రన్స్​కే 2 వికెట్లు పడటంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. అయితే రచిన్ రవీంద్ర (75), డారిల్ మిచెల్ (83 నాటౌట్) ఇద్దరూ ఆ టీమ్​ను ఆదుకున్నారు. పేస్​తో పాటు స్పిన్​ అటాక్​ను సమర్థంగా ఎదుర్కొని రన్స్ చేశారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సులు బాదారు. ముఖ్యంగా కుల్​దీప్ బౌలింగ్​ను టార్గెట్ చేసుకొని సిక్సులు మీద సిక్సులు కొట్టారు. అయితే ఒక దశలో వికెట్లు తీసేందుకు భారత్​కు ఛాన్స్ దొరికింది. షమి బౌలింగ్​లో రచిన్ రవీంద్ర ఇచ్చిన ఈజీ క్యాచ్​ను రవీంద్ర జడేజా మిస్ చేశాడు.

జడేజాతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. జడ్డూ బౌలింగ్​లో క్యాచ్​ను కీపర్ కేఎల్ రాహుల్ వదిలేశాడు. అయితే రచిన్ క్యాచ్​ను జడేజా మిస్ చేసినప్పుడు అతడి వైఫ్​ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది. భర్త క్యాచ్ వదిలేయడంతో షాకైన రివాబా జడేజా రెండు చేతుల్ని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నారు. జడ్డూ భార్య రియాక్షన్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. జడేజా భార్య రియాక్షన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs NZ: శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్.. బాల్ పట్టాక రియాక్షన్ హైలైట్!

Show comments