Tirupathi Rao
భారత్- న్యూజిలాండ్ ముంబై వేదికగా వరల్డ్ కప్ 2023 తొలి సెమీ ఫైనల్ లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక సందేశం అందరినీ కలవరపెడుతోంది.
భారత్- న్యూజిలాండ్ ముంబై వేదికగా వరల్డ్ కప్ 2023 తొలి సెమీ ఫైనల్ లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక సందేశం అందరినీ కలవరపెడుతోంది.
Tirupathi Rao
వరల్డ్ కప్ 2023 చివరి అంఖానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. భారత్- న్యూజిలాండ్ జట్లు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ముంబయి వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వాంఖడే స్టేడియానితి బెదిరింపు సందేశం రావడం కలకలం రేపుతోంది. ఈ సందేశం వచ్చిన తర్వాత ముంబయి పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే మ్యాచ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రం సమయం ఉంది. ఇలాంటి తరుణంలో మ్యాచ్ సమయంలో ఊహించని ఘోరం జరగబోతోంది అంటూ ముంబై పోలీసులకు X వేదికగా సందేశం వచ్చింది. అంతేకాకుండా సందేశం పంపిన వ్యక్తి తుపాకీ, తూటాలు, హ్యాండ్ గ్రనేడ్లు ఫొటోలు కూడా పంపడం మరింత కంగారు పెట్టిస్తోంది.
ఈ బెదిరింపు సందేశం విషయాన్ని ముంబయి పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఇది నిజామా అబద్ధమా అనే విషయాన్ని పక్కన పెడితే తాము రిస్క్ తీసుకోదల్చుకోలేదన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ బెదిరింపు పోస్టు నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఒకింత అలజడి నెలకొంది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ సెమీస్ లో గెలిచి న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ ను న్యూజిలాండ్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మాత్రం కివీస్ పై పైచేయి సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా వరల్డ్ కప్ టీమిండియా జైత్రయాత్ర కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమష్టి కృషిని కనబరిచింది. ప్రస్తుతం సెమీస్ నేపథ్యంలో భారత్ మరింత పోరాటపటిమ చూపించాల్సి ఉంది. ఇప్పటికే లీగ్ దశలో కివీస్ ని ఓడించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అయినా న్యూజిలాండ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాంఖడే స్టేడియంలో టాస్ కీలకంగా మారుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. టాస్ ఎవరు గెలిస్తే వాళ్లే మ్యాచ్ గెలుస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలపై స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను చిన్నప్పటి నుంచి ఈ వాంఖడే స్టేడియంలో ఆడుతున్నాని.. అసలు అక్కడ టాస్ కీలకమే కాదంటూ కుండ బద్దలు కొట్టేశాడు. ఏది ఏమైనా కూడా సెమీస్ లో ఘన విజయం సాధించి.. ఫైనల్ చేరాలంటూ భారతీయులంతా కోరుకుంటున్నారు.