iDreamPost
android-app
ios-app

IND vs ENG: దిగ్గజాలను దాటేశారు.. సరికొత్త చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా!

  • Published Jan 25, 2024 | 3:16 PM Updated Updated Jan 25, 2024 | 3:16 PM

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల జోడీ సరికొత్త చరిత్రను నెలకొల్పింది. ఈ క్రమంలోనే దిగ్గజ బౌలర్లను దాటేశారు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల జోడీ సరికొత్త చరిత్రను నెలకొల్పింది. ఈ క్రమంలోనే దిగ్గజ బౌలర్లను దాటేశారు.

IND vs ENG: దిగ్గజాలను దాటేశారు.. సరికొత్త చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా!

హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బాజ్ బాల్ తో అదరగొడతాం, మా ప్లేయర్లతో జాగ్రత్త అంటూ కొంత మంది ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లతో పాటుగా ఆ టీమ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ కూడా భారత ప్లేయర్లకు సవాల్ తో కూడిన హెచ్చరికలు ఇచ్చారు. ఆ వార్నింగ్ లను తుత్తునియలు చేస్తూ.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు ఇంగ్లీష్ బ్యాటర్లను తమ స్పిన్ తో చుట్టేశారు. స్టార్ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ త్రయం కలిసి ప్రత్యర్థి నడ్డివిరిచారు. ఈ క్రమంలోనే దిగ్గజ బౌలర్లను దాటి అశ్విన్-జడేజా ద్వయం సరికొత్త చరిత్ర నెలకొల్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీమ్ కు ఓ మోస్తారు ఆరంభం దక్కిందనే చెప్పాలి. ఓపెనర్లు కార్లే-డకెట్ జోడీ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వెటరన్ బౌలర్ అశ్విన్ విడగొట్టాడు. బెన్ డకెట్(35)ను అశ్విన్ పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత జడేజా తన పనిమెుదలు పెట్టారు. దీంతో ఇంగ్లాండ్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ల స్పిన్ త్రయం ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సీనియర్ బౌలర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల ద్వయం ఓ సరికొత్త చరిత్రకు నాందిపలికారు.

టీమిండియా దిగ్గజ బౌలర్లు అయిన అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ లు సాధించిన అరుదైన రికార్డును బద్దలు కొట్టారు అశ్విన్-జడేజాలు. ఇంతకీ ఆ ఘనత ఏంటంటే? భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన జోడీగా రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాలు రికార్డు నెలకొల్పారు. వీరిద్దరు కలిసి ఇప్పటి వరకు 503 వికెట్లు తీశారు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజ బౌలర్లు అయిన అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ పేరిట ఉంది. ఈ లెజెండరీ బౌలింగ్ ద్వయం 54 మ్యాచ్ ల్లో 501 వికెట్లు కూల్చారు. ప్రస్తుతం ఈ రికార్డును అశ్విన్-జడేజా జోడీ బ్రేక్ చేసి నయా హిస్టరీ క్రియేట్ చేసింది.

ఇక ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఇంగ్లాండ్ కు చెందిన పేస్ గుర్రాలు జేమ్స్ అండర్సన్-స్టువర్ట్ బ్రాడ్. వీరిద్దరు కలిసి 138 టెస్ట్ మ్యాచ్ ల్లో 1039 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్  70 పరుగులు చేసి.. చివరి వికెట్ గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. మరి అశ్విన్-జడేజాలు సాధించిన సరికొత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.