iDreamPost
android-app
ios-app

IND vs ENG: పీటర్సన్ కు క్షమాపణలు చెప్పిన శుబ్ మన్ గిల్! ఎందుకంటే?

  • Published Feb 06, 2024 | 4:31 PM Updated Updated Feb 06, 2024 | 4:31 PM

టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు అయిన కెవిన్ పీటర్సన్ కు క్షమాపణలు చెప్పాడు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు అయిన కెవిన్ పీటర్సన్ కు క్షమాపణలు చెప్పాడు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs ENG: పీటర్సన్ కు క్షమాపణలు చెప్పిన శుబ్ మన్ గిల్! ఎందుకంటే?

ఇంగ్లాండ్ తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో అద్భుత శతకం సాధించి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్. గత కొంతకాలంగా విఫలం అవుతున్న అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం కూడా విదితమే. ఇక ఆ విమర్శలన్నింటికీ.. తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు గిల్. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంగ్లాండ్ దిగ్గజం, మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ కు క్షమాపణలు చెప్పాడు గిల్. దాంతో అందరూ షాక్ అయ్యారు. మరి పీటర్సన్ కు గిల్ కు సారీ ఎందుకు చెప్పాడు? కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

శుబ్ మన్ గిల్.. గత కొంతకాలంగా పూర్ ఫామ్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. అయితే ఆ విమర్శలన్నింటికీ.. తాజాగా సాధించిన శతకంతో సమాధానం చెప్పాడు. కాగా.. తనపై విమర్శలు వస్తున్న సమయంలో తనకు మద్ధతుగా నిలిచిన ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ కు ధన్యవాదాలు తెలిపాడు శుబ్ మన్ గిల్. అసలేం జరిగింది అంటే? గిల్ బాగా ఆడకపోవడంతో.. అతడిని జట్టులోనుంచి తొలగించాలని, అతడి ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ లాంటి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని కొందరు మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో గిల్ కు తన సపోర్ట్ ఇచ్చాడు పీటర్సన్.

సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వెస్ కల్లిస్ తన తొలి 10 టెస్టుల్లో 22 సగటును మాత్రమే కలిగి ఉన్నాడని, తర్వాత అతడు ఎంత పెద్ద దిగ్గజంగా ఎదిగాడో తెలుసు కదా. అలాగే గిల్ కు కూడా టైమ్ ఇవ్వాలని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. పీటర్సన్ ఇచ్చిన ప్రోత్సాహంతో రెండో టెస్ట్ లో సెంచరీ చేశాడు గిల్. అయితే సెంచరీ అనంతరం ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా పనిచేస్తున్న పీటర్సన్ ను కలవలేకపోయినందుకు క్షమాపణలు కోరాడు. “నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మిమ్మల్ని కలుసుకోనందుకు నన్ను క్షమించాలి. వేలికి స్కాన్ తీయ్యాలి అనడంతో ఫాస్ట్ గా వెళ్లాల్సి వచ్చింది” అంటూ పీటర్సన్ ను క్షమాపణలు కోరాడు ఈ యువ ప్లేయర్. దీంతో గిల్ మంచి తనానికి ఫ్యాన్స్ సలామ్ కొడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగుండటమే స్టార్ ప్లేయర్ల లక్షణం అంటూ కితాబిస్తున్నారు. మరి పీటర్సన్ ను గిల్ క్షమాపణలు కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rohit Sharma: అందుకే రోహిత్‌ను తీసేశామన్న ముంబై కోచ్‌! వెంటనే రితికా రిప్లై