iDreamPost
android-app
ios-app

Rishabh Pant: వీడియో: వింటేజ్ పంత్ ఈజ్ బ్యాక్.. ఆ సిక్స్ చూడాల్సిందే!

  • Published Sep 21, 2024 | 12:09 PM Updated Updated Sep 21, 2024 | 12:09 PM

Rishabh Pant single hand six: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెచ్చిపోయాడు. మరీ ముఖ్యంగా తన వింటేజ్ షాట్స్ ను మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొట్టిన సింగిల్ హ్యాండ్ సిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Rishabh Pant single hand six: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రెచ్చిపోయాడు. మరీ ముఖ్యంగా తన వింటేజ్ షాట్స్ ను మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొట్టిన సింగిల్ హ్యాండ్ సిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Sep 21, 2024 | 12:09 PMUpdated Sep 21, 2024 | 12:09 PM
Rishabh Pant: వీడియో: వింటేజ్ పంత్ ఈజ్ బ్యాక్.. ఆ సిక్స్ చూడాల్సిందే!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత.. సుదీర్ఘ విరామం తీసుకొని టెస్ట్ ఫార్మాట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. 634 రోజుల తర్వాత టెస్టుల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన పంత్ తన వింటేజ్ ఆటతీరుతో అలరించాడు. తన మార్క్ షాట్స్ తో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసిన ఈ స్టార్ ప్లేయర్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫిఫ్టీ కంప్లీట్ చేసుకుని హండ్రెడ్ వైపు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తన వింటేజ్ షాట్స్ ను మరోసారి ప్రేక్షకులకు రుచిచూపిస్తున్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో పంత్ కొట్టిన ఆ సింగిల్ హ్యాండ్ సిక్స్ చూసి తీరాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 81/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ బ్రేక్ సమయానికి 205/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. దాంతో ఇప్పటి వరకు భారత్ కు 432 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. క్రీజ్ లో శుబ్ మన్ గిల్(86), రిషబ్ పంత్(82) పరుగులతో సెంచరీ వైపు దూసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా పంత్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. చూడముచ్చటైన షాట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన సింగిల్ హ్యాండ్ సిక్స్ బాది.. వింటేజ్ పంత్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు.

మెహిదీ హసన్ వేసిన ఓ ఓవర్లో.. రెండు అడుగులు అలా ముందుకు వచ్చి.. సింగిల్ హ్యాండ్ తో పంత్ కొట్టిన సిక్స్ చూడాల్సిందే. సింగిల్ హ్యాండ్ సిక్స్ పంత్ ట్రేడ్ మార్క్ సిక్స్ గా పేరుగాంచిన విషయం తెలిసిందే. అయితే టీ20, వన్డే ఫార్మాట్ లోనే పంత్ ఇలాంటి విన్యాసాలు చేస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ.. తనదైన స్టైల్లో టెస్టుల్లో సైతం అలవోకగా సింగిల్ హ్యాండ్ తో సిక్సులు బాదుతూ.. రెచ్చిపోతున్నాడు. ఈ ఒక్క సిక్సే కాదు.. ఈ ఇన్నింగ్స్ లో ఇప్పటికే అద్భుతమైన షాట్స్ ఆడాడు ఈ చిచ్చర పిడుగు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వింటేజ్ పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి పంత్ సింగిల్ హ్యాండ్ సిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss