iDreamPost
android-app
ios-app

IND vs BAN: భారీ ఆధిక్యం ఉన్నా.. బంగ్లాకు ఫాలో ఆన్ ఎందుకివ్వలేదు? కారణం ఏంటంటే?

  • Published Sep 21, 2024 | 11:14 AM Updated Updated Sep 21, 2024 | 11:14 AM

Why Did Rohit Sharma Not Enforce Follow-On: తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం ఉన్నా గానీ.. బంగ్లాదేశ్ ను టీమిండియా ఎందుకు ఫాలో ఆన్ ఆడించలేదు? అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే దానికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటంటే?

Why Did Rohit Sharma Not Enforce Follow-On: తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం ఉన్నా గానీ.. బంగ్లాదేశ్ ను టీమిండియా ఎందుకు ఫాలో ఆన్ ఆడించలేదు? అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే దానికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటంటే?

IND vs BAN: భారీ ఆధిక్యం ఉన్నా.. బంగ్లాకు ఫాలో ఆన్ ఎందుకివ్వలేదు? కారణం ఏంటంటే?

చెపాక్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటు బ్యాట్ తో అటు బాల్ తో రాణిస్తూ.. ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తోంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 376 పరుగులకు భారత్ ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే పరిమితం చేసింది. దాంతో టీమిండియాకు 227 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అయితే ఇంత లీడ్ ఉన్నప్పటికీ.. బంగ్లాను ఫాలో ఆన్ ఆడించలేదు. ఇప్పుడు ఇదే ప్రశ్న సగటు క్రికెట్ ఫ్యాన్స్ లో మెదులుతోంది. బంగ్లాను టీమిండియా ఫాలో ఆన్ ఆడించకపోవడానికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సాధారణంగా ఇంత లీడ్ ఉన్నప్పుడు ఏ టీమ్ అయినా.. ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడిస్తుంది. కానీ.. ఇక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ అలా చేయలేదు. బంగ్లాను 149 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఇలా ఎందుకు చేసింది? ఫాలో ఆన్ ఆడించాల్సిందిగా? అని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో మెుదటిది ఇటీవలే ముగిసిన పాక్-బంగ్లా తొలి టెస్ట్.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 448/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బంగ్లా అనూహ్యంగా చెలరేగి 565 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో బంగ్లాదేశ్ కు 117 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆ తర్వాత పాక్ ను సెకండ్ ఇన్నింగ్స్ లో తక్కువ రన్స్ కే కట్టడి చేసి.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక సెకండ్ రీజన్ కు వస్తే.. టీమిండియా బౌలర్లకు విశ్రాంతిని ఇవ్వాలని బంగ్లాను ఫాలో ఆన్ ఆడించలేదు.

కాగా.. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 47 ఓవర్లు వేసినప్పటికీ.. వెంట వెంటనే బౌలింగ్ చేయడంతో.. బౌలర్లకు రెస్ట్ లేకుండా పోతుందని పైగా వచ్చే రోజుల్లో మరిన్ని సిరీస్ లు ఆడాల్సి ఉందని, వారికి పని భారం కావొద్దని భావించే సారథి రోహిత్ శర్మ ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 81/3 తో ఆటను ఆరంభించిన టీమిండియా.. వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతోంది. శుబ్ మన్ గిల్ అర్ధసెంచరీ సాధించగా.. రిషబ్ పంత్ సైతం ఫిఫ్టీ కొట్టి మంచి జోరుమీదున్నారు. దాంతో భారీ ఆధిక్యం దిశగా టీమిండియా దూసుకెళ్తోంది.