iDreamPost
android-app
ios-app

అలా చేసుంటే టీమిండియా గెలిచేది, ఎప్పుడూ ఇలాగే.. అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 08:04 PM, Mon - 20 November 23

టీమిండియా ఓటమిపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు పాక్ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్. అలా చేసుంటే టీమిండియా గెలిచేదని తన మార్క్ రివ్యూ ఇచ్చాడు.

టీమిండియా ఓటమిపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు పాక్ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్. అలా చేసుంటే టీమిండియా గెలిచేదని తన మార్క్ రివ్యూ ఇచ్చాడు.

  • Author Soma Sekhar Published - 08:04 PM, Mon - 20 November 23
అలా చేసుంటే టీమిండియా గెలిచేది, ఎప్పుడూ ఇలాగే.. అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ ను టీమిండియా ముద్దాడుతుందని ప్రతీ ఒక్క భారతీయుడు కలలు కన్నాడు. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి ప్రపంచ కప్ రన్నరప్ గా నిలిచింది టీమిండియా. ఈ ఓటమిని భారత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. భారత జట్టు ఓటమిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు స్పందిస్తున్నారు. ఓడిపోయిన తీరుపై వారివారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమిపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు పాక్ దిగ్గజ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్. అలా చేసుంటే టీమిండియా గెలిచేదని తన మార్క్ రివ్యూ ఇచ్చాడు.

టీమిండియా ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఈ మెగాటోర్నీలో లీగ్ దశలో ఓటమే ఎరుగని జట్టుగా ముందుకు సాగిన భారత టీమ్ ప్రయాణం.. ఫైనల్లో విషాద గాథగా ముగిసింది. ఇక ఈ ఓటమిపై వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఓటమిపై తనదైన శైలిలో స్పందించాడు పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్. భారత్ ఓడిపోవడంపై పాక్ మాజీ లెజెండ్ ఈ విధంగా స్పందించాడు..

“టీమిండియా లక్ తో వరల్డ్ కప్ ఫైనల్ కు చేరలేదు. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడి తుది పోరుకి వచ్చింది. కానీ.. ఫైనల్ మ్యాచ్ కోసం రెడీ చేసిన పిచ్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మెరుగైన పిచ్ తయ్యారు చేసుకోవాల్సింది. ఇక బ్యాటింగ్ లో కూడా భారత ఆటగాళ్లు ఒత్తిడికి గురైయ్యారు. అలా కాకుండా ఎప్పటిలాగే దూకుడుగా తమ ఆటను కొనసాగించాల్సింది. పిచ్ నుంచి మరికొంత పేస్, బౌన్స్ లభిస్తే.. టాస్ పెద్దగా ప్రభావం చూపేదికాదని నా అభిప్రాయం. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే? టీమిండియా ఎప్పుడూ కూడా ఇలాంటి పెద్ద మ్యాచ్ ల్లోనే తడబడుతూ ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు అక్తర్. ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా మంచి పిచ్ రెడీ చేసుకోవాల్సిందని, అలా చేసుంటే.. భారత్ కచ్చితంగా గెలిచేదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. మరి షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.