IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. హోటల్ గదులకు రెక్కలు! ఒక్కరూమ్ ఎంతంటే?

వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. హోటల్ గదులకు రెక్కలు! ఒక్కరూమ్ ఎంతంటే?

  • Author Soma Sekhar Published - 05:30 PM, Fri - 17 November 23

ఎంతో ఉత్సాహంతో వరల్డ్ కప్ మ్యాచ్ లు గ్రౌండ్ లో చూద్దామని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఊహించని షాకిచ్చాయి అహ్మదాబాద్ హోటల్స్. ఒక్కో రూమ్ ధర ఆకాశాన్ని తాకడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంతకీ ఒక్క రూమ్ ధర ఎంతంటే?

ఎంతో ఉత్సాహంతో వరల్డ్ కప్ మ్యాచ్ లు గ్రౌండ్ లో చూద్దామని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఊహించని షాకిచ్చాయి అహ్మదాబాద్ హోటల్స్. ఒక్కో రూమ్ ధర ఆకాశాన్ని తాకడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంతకీ ఒక్క రూమ్ ధర ఎంతంటే?

  • Author Soma Sekhar Published - 05:30 PM, Fri - 17 November 23

ప్రస్తుతం ప్రపంచ మెుత్తం వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతోంది. ముగింపు దశకు చేరుకున్న ఈ మెగా ఈవెంటో లో ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మారింది. 45 రోజుల పాటు జరిగిన ఈ విశ్వ సమరం నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఇక స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కావడంతో.. భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు కొనుక్కుని అక్కడికి చేరిపోయారు కొందరు ఫ్యాన్స్. ఈ క్రమంలో వారికి ఊహించని షాక్ తగిలింది. అందరూ ఒక్కసారిగా ఎగబడటంతో.. హోటల్ రూమ్స్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్క రూమ్ ధర ఎంతంటే?

వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా వివిధ దేశాలకు చెందిన అభిమానులు వేలల్లో వస్తారు. ఇక స్వదేశంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కావడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న టీమిండియా ఫ్యాన్స్ టికెట్స్ కొనుక్కుని మ్యాచ్ చూడ్డానికి రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో వారికి భారీ షాకిచ్చాయి హోటల్ రూమ్స్ ధరలు. ఫ్యాన్స్ ఒక్కసారిగా అహ్మదాబాద్ సిటీకి ఎగబడటంతో.. స్థానికంగా ఉండే హోటల్ రూమ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఇక్కడి హోటల్లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ. లక్ష వరకు డిమాండ్ చేస్తున్నారు.

ఇక గదుల ఛార్జీలు 24 వేల నుంచి లక్ష రూపాయాలు దాటిపోయింది. ఫస్ట్ క్లాస్ హోటల్ గదికి ఒక్క రాత్రికి రూ. 10వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫైవ్ స్టార్ లాంటి బడా హోటల్స్ లో ఒక్క రాత్రికి లక్షకు పైగానే ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను అహ్మదాబాద్ హోటల్ ఓనర్లు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇదే కాక.. అహ్మదాబాద్ కు వెళ్లే విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. సుమారు 200 నుంచి 300 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచే అహ్మదాబాద్ కు ఒక్క టికెట్ రూ. 15 వేలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోనే సీటింగ్ పరంగా అతి పెద్ద స్టేడియంగా పేరుగాంచిన ఈ వేదిక లక్షా 30 వేల సామర్థ్యం కలిగిఉంది. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తో పాటుగా,సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవబోతున్నారు.

Show comments