iDreamPost
android-app
ios-app

కీలక సమయంలో చెత్త షాట్ ఆడిన టీమిండియా బ్యాటర్.. సూర్యకుమార్ సీరియస్!

  • Author singhj Updated - 04:28 PM, Fri - 24 November 23

ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20 మ్యాచ్​లో ఆఖర్లో ఒక టీమిండియా బ్యాటర్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో అతడిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యాడు.

ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20 మ్యాచ్​లో ఆఖర్లో ఒక టీమిండియా బ్యాటర్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో అతడిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యాడు.

  • Author singhj Updated - 04:28 PM, Fri - 24 November 23
కీలక సమయంలో చెత్త షాట్ ఆడిన టీమిండియా బ్యాటర్.. సూర్యకుమార్ సీరియస్!

వన్డే వరల్డ్ కప్ ఫైనల్​ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే భారత అభిమానులు కోలుకుంటున్నారు. ఎన్నో ఆశలు రేపి ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడటాన్ని ఫ్యాన్స్​తో పాటు సాధారణ క్రికెట్ ప్రేమికులు కూడా తట్టుకోలేకపోయారు. అయితే అయ్యిందేదో అయిపోయింది.. ఫ్యూచర్​లోనైనా ఐసీసీ ట్రోఫీలు నెగ్గాలని కోరుకుంటున్నారు. అలాంటి అభిమానులకు ఊరటను ఇస్తూ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​ను విజయంతో ప్రారంభించింది టీమిండియా. విశాఖపట్నం వేదికగా నిన్న జరిగిన మ్యాచ్​లో రెండు వికెట్ల తేడాతో నెగ్గి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసీస్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు.

బ్యాటింగ్​కు అనుకూలంగా ఉన్న పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. అయితే మ్యాట్ షార్ట్ (13) ఔటైనా జోష్ ఇంగ్లిస్ (110)తో కలసి భారీ పార్ట్​నర్​షిప్ నెలకొల్పాడు స్టీవ్ స్మిత్ (52). ముఖ్యంగా ఇంగ్లిస్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అతడి ఇన్నింగ్స్​లో ఏకంగా 8 సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే ఇంగ్లిస్ డామినేషన్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆఖరి ఓవర్లలో క్విక్​గా రన్స్ చేయడంలో మార్కస్ స్టొయినిస్ (7 నాటౌట్), టిమ్ డేవిడ్ (19 నాటౌట్) ఫెయిలయ్యారు. దీంతో 20 ఓవర్లకు 208 రన్స్ చేసింది ఆసీస్. చివర్లో ఆ టీమ్ బ్యాటర్లను పేసర్ ముకేష్ కుమార్ బాగా కట్టడి చేశాడు. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన భారత్​కు ఆరంభంలోనే షాక్ తగిలింది.

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) డైమండ్ డకౌట్​గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21)తో సమన్వయ లోపం కారణంగా గైక్వాడ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే జైస్వాల్ కూడా స్టీవ్ స్మిత్​కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ టైమ్​లో ఇషాన్ కిషన్ (58)తో జతకట్టిన సూర్యకుమార్ యాదవ్ (80) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులు కొడుతూ ఈ జోడీ ఆసీస్​ను కంగారుపెట్టింది. వీళ్లిద్దరే మ్యాచ్​ను ఫినిష్ చేస్తారనిపించింది. కానీ భారీ షాట్స్​ కొట్టేందుకు ప్రయత్నించి ఇద్దరూ వికెట్లు పారేసుకున్నారు. తిలక్ వర్మ (12) కూడా భారీ షాట్​ ఆడేందుకు ట్రై చేసి ఔటయ్యాడు. అయితే రింకూ సింగ్ (22) చివరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు.

ఆసీస్​తో ఫస్ట్ టీ20లో భారత్ సునాయాసంగా గెలవాల్సింది. కానీ స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ చేసిన ఓ తప్పు కారణంగా పీకల మీదకు తెచ్చుకుంది. విజయానికి మరో 2 రన్స్ కావాల్సిన టైమ్​లో ఇంకో 3 బంతులు ఉన్నాయి. సింగిల్స్ లేదా డబుల్స్ తీసి మ్యాచ్​ను ఫినిష్ చేయొచ్చు. కానీ భారీ సిక్స్ కొట్టి గెలిపిద్దామనుకున్న అక్షర్.. అబాట్ వేసిన బాల్​ను గట్టిగా కొట్టాడు. కానీ బాల్​ అక్కడే లేవడంతో బౌలర్ అబాట్ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవి బిష్ణోయ్, అక్షర్​దీప్ సింగ్​లు రింకూకు స్ట్రైక్ ఇవ్వాలనే ఉద్దేశంతో రన్​కు ప్రయత్నించి రనౌట్ అయ్యారు.

చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నా రింకూ సింగ్ కూల్​గా సిక్స్ కొట్టి గెలిపించాడు. అయితే కీలక సమయంలో అక్షర్ చెత్త షాట్ కొట్టి ఔటవ్వడంతో అతడిపై కెప్టెన్ సూర్యకుమార్ సీరియస్ అయ్యాడు. ఆ టైమ్​లో డగౌట్​లో కూర్చుకున్న మిస్టర్ 360 చేయి చూపిస్తూ.. ఇదేం చెత్త షాట్ అన్నట్లు సైగ చేశాడు. అక్షర్​పై సూర్య సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అక్షర్ చెత్త షాట్ ఆడి ఔట్ అవ్వడంపై సూర్య సీరియస్ అవ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నిన్న రింకూని హగ్ చేసుకున్న ఇతను ఎవరు? అంతా ఇతని పుణ్యమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి