ఇండియా-ఆసీస్ మ్యాచ్ లో అందరూ మహ్మద్ షమీ, గిల్, గైక్వాడ్, రాహుల్ కెప్టెన్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక చివరిగా ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ బ్యాటింగ్ గురించి చెప్పుకుంటున్నారు. కానీ సూర్య నిన్న ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమనే చెప్పాలి. తన శైలికి విరుద్దంగా ఆడి మ్యాచ్ గెలిపించడమే కాకుండా.. అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఎప్పుడూ విభిన్నమైన షాట్లతో అలరించే సూర్య.. నిన్నటి మ్యాచ్ లో మాత్రం అతడి బ్యాటింగ్ లో ఓ బాధ్యత కనిపించింది. ఇక మ్యాచ్ అనంతరం అతడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ నా కల అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్.
సూర్య కుమార్ యాదవ్.. క్రీజ్ లోకి వచ్చాడు అంటే చాలు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ ఉంటాడు. ఎంతటి బౌలరైనా సరే సూర్య ముందు జుజుబీ అనే చెప్పాలి. గ్రౌండ్ నలువైపులా అతడు ఆడే షాట్స్ చూడ్డానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఇక అతడు కొట్టే స్కూప్ షాట్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో సూర్య తన శైలికి భిన్నంగా ఆడి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. టీ20లో సూర్య ఎంత డేంజరస్ బ్యాటరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో అతడు వన్డేలకు పనికిరాడని, వరల్డ్ కప్ కు అతడిని ఎందుకు ఎంపిక చేశారని తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు అతడిని ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. కాగా.. ఆసీస్ తో సిరీస్ సూర్యకు కీలకం. ఎందుకంటే.. టీ20 బ్యాటర్ అనే ముద్రను వరల్డ్ కప్ ముందు చెరిపేసుకోవడానికి ఈ సిరీస్ పెద్ద అవకాశం. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తొలి వన్డేలోనే సమయోచిత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ..” ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడాలని ఎప్పటి నుంచో కలలు కంటూ ఉన్నాను. మ్యాచ్ చివరిదాక క్రీజ్ లో నిలబడాలని చూశాను. కానీ కుదరలేదు. అయితే ఈ విజయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నా కెరీర్ లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం, స్వీప్ షాట్స్ ఆడకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. నన్ను నేను మర్చుకుంటూ.. వన్డే ఫార్మాట్ కు పూర్తిగా సిద్దమవుతున్నాను. ఈ మ్యాచ్ లో ఓపెనర్ల బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు ఈ 360 బ్యాటర్.
ఇక నుంచి ఇదే రీతిలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అంటూ సూర్య పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సూర్య లాస్ట్ లో బ్యాక్ సైడ్ ఓ సిక్సర్ బాదాడు. ఇలాంటి షాట్స్ అతడు క్రీజ్ లోకి వచ్చిన 5 లేదా 10 బంతుల్లోనే ఆడేస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో 45 బంతుల తర్వాత ఇలాంటి షాట్ ఆడాడు అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. అతడు ఆటలో ఎంత పరిణతి చూపించాడో. 49 బంతులు ఎదుర్కొన్న సూర్య 5 ఫోర్లు, ఓ సిక్స్ తో 50 పరుగులు చేశాడు. మరి సూర్య ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The start we wanted 🔥💪 pic.twitter.com/vw3DgKhLtH
— Surya Kumar Yadav (@surya_14kumar) September 22, 2023