iDreamPost

వెరైటీ లుక్ లో కత్తిసాము చేస్తున్న ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ను గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Published - 10:45 AM, Sat - 23 September 23
  • Author Soma Sekhar Published - 10:45 AM, Sat - 23 September 23
వెరైటీ లుక్ లో కత్తిసాము చేస్తున్న ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ను గుర్తుపట్టారా?

టీమిండియాలోకి ఎంతో మంది ప్రతిభావంతమైన క్రికెటర్లు వస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ మూలంగా ఎందరో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు.. వెలుగులోకి వస్తున్నారు. అలా వచ్చిన కొందరు ప్లేయర్లు టీమిండియాలో సుస్థిర స్థానాన్ని కూడా ఏర్పరచుకుంటున్నారు. అలాగే వచ్చాడు ఓ కుర్రాడు. దేశవాలీ క్రికెట్ లో సత్తా చాటడమే కాకుండా ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా.. అతడు తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గుండుతో కత్తిసాము చేస్తున్న పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

పైన ఫొటోలో గుండు కొట్టించుకుని, కత్తిసాము చేస్తున్న టీమిండియా యువ ఓపెనర్ ఎవరో మీరు గుర్తుపట్టారా? ఈ ఏడాది ఐపీఎల్ లో ఇతడు అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీమిండియా టెస్ట్, టీ20 జట్టులోకి అరంగేట్రం కూడా చేశాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్, టీ20 సిరీస్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ కెరటం. ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొట్టిన కుర్రాడు, ప్రస్తుతం గుండుతో కత్తిసాము చేస్తున్న ఆటగాడు మరెవరో కాదు.. అతడే యశస్వీ జైస్వాల్. ఆసీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో చోటు దక్కించుకోలేకపోయిన ఈ యువ ఆటగాడు.. ఈ సమయాన్ని ప్రాక్టీస్ లో గడుపుతున్నాడు. కొన్ని కొత్త విద్యలు నేర్చుకుంటున్నాను అంటూ.. గుండు కొట్టించుకుని పూర్తిగా గుర్తుపట్టకుండా మారిపోయాడు ఈ యువ ఓపెనర్. న్యూ లుక్ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వెరైటీ లుక్ చూసి షాక్ కు ఆశ్చర్యపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరి మీలో ఎంతమంది ఈ పిక్ చూడగానే అతడు జైస్వాల్ అని గుర్తుపట్టారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి