వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పిచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పిచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.
వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది ఆస్ట్రేలియా. దీంతో ఫైనల్లోకి ప్రవేశించి.. టీమిండియాను ఢీకొట్టేందుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న(ఆదివారం) తుది పోరు జరగనుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ పిచ్ పై సౌతాఫ్రికాతో మ్యాచ్ అనంతరం మాట్లాడాడు ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్. సఫారీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్ పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా మారడంతో.. కంగారూ జట్టు అతి కష్టం మీద గెలిచింది. అయితే సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసినా.. మిగతా వారందరూ విఫలం కావడంతో పిచ్ పరిస్థితిపై చర్చకు తెరలేసింది. ఈ క్రమంలోనే స్టార్క్ ఫైనల్ మ్యాచ్ పిచ్ పై కొన్ని కామెంట్స్ చేశాడు.
ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీఫైనల్లో ఆసీస్ చమటోడ్చి గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభంలో ఒకలా ఉన్న పిచ్ రానురాను బౌలింగ్ కు అనుకూలంగా మారడంతో.. కంగారూ జట్టు అతి కష్టం మీద విజయం సాధించింది. దీంతో పిచ్ లపై మరోసారి చర్చకు దారితీసింది ఈ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈడెన్ గార్డెన్ పిచ్ పై, అలాగే ఫైనల్ మ్యాచ్ జరిగే పిచ్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు మిచెల్ స్టార్క్. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫారెన్స్ తో అతడు మాట్లాడుతూ..
“ఈడెన్ గార్డెన్ పిచ్ ఎక్కువ సమయం కవర్స్ తో కప్పి ఉంచినట్లుగా లేదు. అందుకే బ్యాటింగ్ కు ఎక్కువగా సహకరించలేదనిపిస్తోంది. క్రీజ్ లో కుదురుకుంటేనే రన్స్ రాబట్టే అవకాశం ఉంది. పైగా నిలకడైన పేస్ ను రాబట్టడం కూడా కష్టంగా మారింది. ఇక ఫైనల్ కోసం సిద్దమవ్వడానికి ఇంకా కాస్త సమయం ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ జరగబోయే పిచ్ ఎలా ఉందనేది అక్కడికి వెళ్లాక, పరిశీలించి చెబుతాం. ఆ పిచ్ కొత్తగా రెడీ చేసిందా? లేదా పాతదా? అనేది అప్పుడే చెప్పగలను” అంటూ చెప్పుకొచ్చాడు స్టార్క్. కాగా.. పిచ్ లను కరెక్ట్ గా అంచనా వేయడంలో నేను ఎక్స్ పర్ట్ ను కాదని, అక్కడ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తేనే ఆ పిచ్ కండీషన్ ను అక్కడి పరిస్థితులను చెప్పగలనంటూ తెలిపాడు స్టార్క్. స్టార్క్ దృష్టిలో టీమిండియాకు అనుకూలంగా పిచ్ తయ్యారు చేస్తారన్న అనుమానం ఉందని కామెంట్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అందుకే పిచ్ చూశాక చెబుతానని స్టార్క్ చెప్పుకొస్తున్నాడని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
#INDvsAUSfinal #WorldcupFinal #CricketWorldCup2023 Earlier, reports claimed that the Ahmedabad pitch for the World Cup final will be a used one. Mitchell Starc had a cheeky take on the subject during a press conference. 😔 pic.twitter.com/dVlzWJDxvQ
— ROBIN cricket news (@ROBINHOODMafia) November 17, 2023