iDreamPost
android-app
ios-app

ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇండియా-కివీస్ మ్యాచ్! ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 09:29 PM, Wed - 15 November 23

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది. అదేంటంటే?

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది. అదేంటంటే?

  • Author Soma Sekhar Published - 09:29 PM, Wed - 15 November 23
ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇండియా-కివీస్ మ్యాచ్! ఎందులో అంటే?

వరల్డ్ కప్.. ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా ఇదే వినపడుతూ ఉంది. ఎవరు గెలిచారు? ఏ ఆటగాడు బాగా ఆడాడు? అన్న ప్రశ్నలే. ఇక ఈ మెగాటోర్నీ ముగింపు దశకు చేరుకుంది. కాగా.. తాజాగా సెమీఫైనల్స్ లో భాగంగా వాంఖడే వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది భారత్. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ దీటుగానే బదులిస్తోంది. కాగా.. ఈ మ్యాచ్ ద్వారా ఓ ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు తెసుకుందాం.

ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దుమ్మురేపే ఆటతీరుతో అదరగొట్టింది. గిల్, రోహిత్, విరాట్, శ్రేయస్ అయ్యర్ లు అదరగొట్టడంతో.. కివీస్ ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ఓ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. అదేంటంటే? వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీకి డిజిటల్ బ్రాడ్ కాస్టర్ గా డిస్నీప్లస్ హాట్ స్టార్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఆల్ టైమ్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది డిస్నీ.

ఈ మ్యాచ్ ను  5.1 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించడంతో సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ అయ్యింది. ఇంతకు ముందు కూడా ఇవే రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డు స్థాయిలో రియల్ టైమ్ వ్యూస్ నమోదు అయ్యాయి. మళ్లీ ఇవే జట్ల మధ్య ప్రపంచ రికార్డ్ వ్యూస్ నమోదు అయ్యాయి. కొన్ని రోజుల కిందట ధర్మశాల వేదికగా జరిగిన ఇండియా-కివీస్ మ్యాచ్ ను గరిష్టంగా 4.30 కోట్ల మంది వీక్షించారు. ఈ రికార్డు తాజాగా బద్దలైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ప్రస్తుతం 37 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. క్రీజ్ లో డార్లీ మిచెల్(105), ఫిలిప్స్(6) పరుగులతో ఉన్నారు. ఈ నాలుగు వికెట్లు షమీ పడగొట్టడం విశేషం.