SNP
Impact Player, BCCI, Jay Shah, IPL 2024: ఐపీఎల్‌లో మాత్రమే ఉన్న రూల్.. ఇంప్యాక్ట్ ప్లేయర్.. ఈ రూల్‌పై క్రికెటర్లలోనే వ్యతిరేకత ఉంది. దీంతో.. ఈ రూల్‌పై తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Impact Player, BCCI, Jay Shah, IPL 2024: ఐపీఎల్‌లో మాత్రమే ఉన్న రూల్.. ఇంప్యాక్ట్ ప్లేయర్.. ఈ రూల్‌పై క్రికెటర్లలోనే వ్యతిరేకత ఉంది. దీంతో.. ఈ రూల్‌పై తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రపంచ క్రికెట్‌లో ఎక్కడాలేని విధంగా ఐపీఎల్‌లోనే మొట్టమొదటి సారి ప్రవేశపెట్టిన రూల్.. ఇంప్యాక్ట్ ప్లేయర్. గతేడాది అంటే 2023 ఐపీఎల్ సీజన్‌లో ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ సీజన్‌లో ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ ఏంటో, దీన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో చాలా మందికి అర్థం కాలేదు. కానీ, ఈ ఏడాది మాత్రం ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌ను అన్ని టీమ్స్ అద్భుతంగా వాడుకుంటున్నాయి. సరైన టైమ్‌లో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను రంగంలోకి దింపుతూ.. వీలైనంత మేలు పొందుతున్నారు. ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్లు.. మ్యాచ్‌పై చాలా ఇంప్యాక్టే చూపిస్తున్నారు. కానీ, ఈ రూల్‌పై కొంత మంది క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ముఖ్యంగా ఆల్‌రౌండర్లు ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రూల్ వల్ల టీమ్‌లో ఆల్‌రౌండర్ల అవసరం తగ్గిపోతుందని, బ్యాటింగ్ అవసరమైనప్పుడు ఒక బ్యాటర్‌ను, తొలుత బ్యాటింగ్ బాగా చేస్తే.. రన్స్‌ను డిఫెండ్ చేసుకోవడానికి ఒక బౌలర్‌ను ఇంప్యాక్ట్ ప్లేయర్ రూపంలో దింపుతున్నారు. దీంతో.. ఆల్‌రౌండర్ల అవసరం తగ్గిపోతూ ఉంది. దీనిపై కొంతమంది క్రికెటర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలని కోరాడు. ఈ రూల్ వల్ల ఆల్‌రౌండర్లే కాదు.. బౌలర్లకు కూడా ఇబ్బంది పడుతున్నారని సిరాజ్ పేర్కొన్నారు. పవర్ ప్లేలో ఒకటి రెండు వికెట్లు పడితే బ్యాటర్లు కాస్త నెమ్మదిగా ఆడేవాళ్లని, కానీ, ఈ ఇంప్యాక్ట్ రూల్ వల్ల 8వ నంబర్ వరకు బ్యాటింగ్ ఉండటంతో పవర్ ప్లేలో వికెట్లు పడినా ఎవరూ నిదానంగా ఆడటం లేదని, రావడం రావడంతోనే విరుచుకుపడుతున్నారంటూ సిరాజ్ పేర్కొన్నాడు.
నేరుగా క్రికెటర్ల నుంచే ఇంప్యాక్ట్ ప్లేయర్‌పై ఇలాంటి ఫీడ్‌బ్యాక్ రావడంతో.. బీసీసీఐ కూడా ఈ ఇంప్యాక్ట్ రూల్‌పై పునరాలోచిస్తుందని తాజాగా బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. పలు విషయాలపై చర్చించేందుకు సమావేశమైంది బీసీసీఐ కమిటీ. ఈ సమావేశంలో ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌పై కూడా చర్చించినట్లు జైషా తెలిపారు. ఐపీఎల్‌లో దీన్ని కేవలం ప్రయోగాత్మకంగానే ప్రవేశపెట్టామని, ఇది పర్మినెంట్ రూల్ కాదని ఆయన వెల్లడించారు. ఇద్దరు ఇండియన్ ప్లేయర్లకు అదనంగా అవకాశం కల్పించవచ్చనే ఉద్దేశంతోనే ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టినట్లు జైషా పేర్కొన్నారు. టీమిండియా ఆటగాళ్లు, ఐపీఎల్ టీమ్ కెప్టెన్స్, కోచ్‌లు, ఫ్రాంచైజీలతో చర్చించి.. ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఒక నిర్ణయం తీసుకుంటామని జైషా వెల్లడించారు. అయితే.. ఈ రూల్ గురించి బీసీసీఐ సమావేశంలో చర్చించారంటే.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఇంప్యాక్ట్ రూల్ ఉండదని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ రూల్‌పై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా దీన్ని రద్దు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ ఉంచాలా? తీసేయాలా? అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jay Shah said “Impact player was used as a test in IPL, it was done so that two Indian players could get a chance. It’s not permanent, we will have a discussion with the Indian captain, players, franchises, coaches & then take a call on it. The meeting can happen once the World… pic.twitter.com/ybidFb5BMF
— Johns. (@CricCrazyJohns) May 10, 2024