ఆ విషయంలో నేను వరెస్ట్‌ పర్సన్‌ని! డేల్‌ స్టెయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Dale Steyn, South Africa: అంతర్జాతీయ క్రికెట్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి.. 600లకు పైగా వికెట్లు పడగొట్టిన దిగ్గజ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ తానో వరెస్ట్‌ పర్సన్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Dale Steyn, South Africa: అంతర్జాతీయ క్రికెట్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి.. 600లకు పైగా వికెట్లు పడగొట్టిన దిగ్గజ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ తానో వరెస్ట్‌ పర్సన్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అతను అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌతాఫ్రికా దిగ్గజ మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కళ్లు చెదిరే, గుండె అదిరే వేగంతో, నిప్పులు చిమ్మే బంతులతో హేమాహేమీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌ అతను. స్టెయిన్‌ గన్‌ అంటూ ప్రపంచ క్రికెట్‌ లోకం అతన్ని కీర్తించింది. అతనే వేగానికి ఎందరో గొప్ప గొప్ప బ్యాటర్లే చేతులెత్తేశారు. అతని బౌలింగ్‌ శైలి, భయపెట్టే బౌన్నర్లు, వణికించే వేగంతో రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో మోస్ట్‌ డేంజరస్‌ బౌలర్‌గా పేరొందిన స్టెయిన్‌ తాజాగా ఓ విషయంలో తానో వరెస్ట్‌ పర్సన్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

తనకు అసలు పిచ్‌ను అంచనా వేయడం రాదని, పిచ్‌ రీడింగ్‌ అంటే తనకు తెలియదని, పిచ్‌ను అంచనా వేసే విషయంలో తానో వరెస్ట్‌ పర్సన్‌ అంటూ వెల్లడించాడు. పిచ్‌ ఎలా ఉంది, ఎలా బిహేవ్‌ చేస్తుంది అనేదాని కంటే బాల్‌ ఎక్కడ వేయాలి అనే ఒక్క దానిపైనే తాను ఫోకస్‌ పెడతానని స్టెయిన్‌ వెల్లడించాడు. అతను చెప్పిన ఈ మాటలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంత కాలం అసలు పిచ్‌ గురించి ఏ మాత్రం పట్టించుకోకుండానే అలా బౌలింగ్‌ వేశావా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంక పిచ్‌ గురించి మంచి అవగాహన ఉండి ఉంటే.. బ్యాటర్లు బతికిబట్టకట్టే పరిస్థితి ఉండేది కాదేమో అంటూ పేర్కొంటున్నారు. అయితే కొంతమంది బౌలర్లు మాత్రం.. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు పిచ్‌ను తెగ పరిశీలిస్తూ ఉంటారు. బాల్‌ ఎక్కడ వేయాలి… పిచ్‌పై గడ్డి ఉందా, పగుళ్లు ఉన్నాయా అని పట్టిపట్టి చూస్తారు. కానీ, అవన్ని చూడకుండానే స్టెయిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో డేంజరస్‌ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్‌లో 93 టెస్టుల్లో 439 వికెట్లు, 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు స్టెయిన్‌. మరి పిచ్‌ రిపోర్డ్‌ గురించి తనకేం తెలియదంటూ స్టెయిన్‌ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments