ఆ విషయంలో విరాట్‌ కోహ్లీని వెనకేసుకొని రాను.. కానీ: దినేష్‌ కార్తీక్‌

Virat Kohli, Dinesh Karthik, IND vs SL: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని ఆ విషయంలో సపోర్ట్‌ చేయడం లేదంటూ దినేష్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Dinesh Karthik, IND vs SL: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని ఆ విషయంలో సపోర్ట్‌ చేయడం లేదంటూ దినేష్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఆ విషయంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని తాను వెనకేసుకొని రాను అంటూ భారత వెటరన్‌ క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి విరాట్‌ కోహ్లీతో డీకేకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కలిసి ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టుకు ఆడతారు. అలాగే టీమిండియాకు కూడా ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడారు. అయితే.. ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో దారుణంగా విఫలం అయ్యారు. తనకు ఎంతో కలిసొచ్చిన కొలంబో పిచ్‌పై చెలరేగిపోతాడు అనుకుంటే.. చతికిలపడిపోయాడు.

కోహ్లీ వైఫల్యం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆరంభంలో రోహిత్‌ శర్మ చెలరేగి ఆడి.. మంచి స్టార్ట్‌ ఇచ్చినా.. వాటిని కోహ్లీ మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. పిచ్‌ కాస్త స్పిన్‌ బౌలింగ్‌కు అనుకూలించడంతో.. కోహ్లీ తన కెరీర్‌లోనే తొలిసారి మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. తొలి వన్డేలో 24, రెండో వన్డేలో 14, చివరి వన్డేలో 20 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ స్పిన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అవ్వడం గమనార్హం.

శ్రీలంకపై విరాట్‌ కోహ్లీతో పాటు టీమిండియా బ్యాటర్ల వైఫల్యంపై స్పందించిన దినేష్‌ కార్తీక్‌.. ‘విరాట్‌ కోహ్లీను వెనకేసుకొని రావడం కాదు కానీ, శ్రీలంక పిచ్‌పై ఆడటం ఏ బ్యాటర్‌కైనా కాస్త ఇబ్బందికరమే. ముఖ్యంగా 8 నుంచి 30 ఓవర్ల మధ్య స్పిన్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంతే సులువైన విషయం కాదు. అందుకే కోహ్లీ అక్కడ కాస్త తడబడ్డాడు.’ అంటూ డీకే పేర్కొన్నాడు. అంటే కోహ్లీది తప్పేం లేదని తాను అనడం లేదు కానీ, పిచ్‌ కాస్త టఫ్‌గా ఉన్న విషయం గుర్తించాలనేది డీకే ఉద్దేశం. అయితే.. లంకపై మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 0-2 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ కోహ్లీపై డీకే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments