SNP
SNP
సాధారణంగా ఇండియా-పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చాలా కాలంగా ఇదే పరిస్థితి ఉన్నా.. ఓ ఐదేళ్ల నుంచి కాస్త ఫ్రెండ్లీ వాతావరణం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య పెద్దగా మ్యాచ్‌లు జరగకపోవడం, ఎప్పుడో ఐసీసీ ఈవెంట్స్‌లో తప్పితే.. పెద్ద ఎదురుపడకపోవడంతో ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య అంత ఫైర్ ఉండటం లేదు. పైగా ఆటగాళ్ల ఈ మధ్య ఆటలో మాత్రమే అగ్రెసివ్‌గా ఉంటూ.. బయట చాలా కూల్ అండ్ రెస్పెక్టెడ్‌గా ఉంటున్నారు. దీంతో.. గతంలో ఆటగాళ్ల మధ్య తరచూ మాటల యుద్ధం జరగడం లేదు.
అయితే.. అప్పుడప్పుడు మ్యాచ్‌లోని హీట్ వల్ల చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. టీ20 వరల్డ్ కప్ 2021 సందర్భంగా పాక్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ, టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అవుటైన తీరును అనుకరిస్తూ ఇచ్చిన సెటైరికల్ ఫోజులు బాగా వైరల్ అయ్యాయి. దానికి టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీ ఆడిన అద్భుతమైన 82 పరుగుల ఇన్నింగ్స్‌తో బదులు తీర్చుకుంది. అయితే.. కొన్నిసార్లు మ్యాచ్‌లు లేకపోయినా.. ఆటగాళ్లు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటారు.
ఈ మధ్య పాకిస్థాన్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్.. టీమిండియా ఆటగాళ్లను గల్లీ పిల్లలతో పోల్చుతూ.. ఇండియాతో ఎప్పుడు మ్యాచ్ ఆడినా.. గల్లీ పొరగాళ్లతో ఆడినట్లు ఉంటుందని చెప్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. తాజాగా తాను అలాంటి మాటలు మాట్లాడలేదని, అయినా ఓ ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎవరూ ఇలా మాట్లాడరని, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. ఓ వ్యక్తి ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ.. తప్పుడు వార్తను ప్రచారం చేసిన ఈ వ్యక్తి అకౌంట్‌ను బ్యాన్ చేయాలంటూ కూడా ఫిర్యాదు చేశాడు ఇఫ్తికార్ అహ్మద్. దీంతో.. టీమిండియా ఆటగాళ్లును ఉద్దేశించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని ఇఫ్తికార్ చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistan cricketer Iftikar Ahmad lashes out on ‘X’ user on a false remark. pic.twitter.com/V9PKTZA1Q4
— CricTracker (@Cricketracker) August 16, 2023
ఇదీ చదవండి: VIDEO: వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్నే అవమానించిన పాకిస్థాన్!