iDreamPost
android-app
ios-app

కోహ్లీని ఊరిస్తున్న ప్రపంచ రికార్డ్‌! ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌తోనే అందుకుంటాడా?

  • Published Mar 22, 2024 | 1:56 PM Updated Updated Mar 22, 2024 | 1:56 PM

Virat Kohli, CSK vs RCB: ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే , ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ ఆరు పరుగులు చేస్తే చాలు అదిరిపోయే రికార్డ్‌ సొంతం అవుతుంది.

Virat Kohli, CSK vs RCB: ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే , ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ ఆరు పరుగులు చేస్తే చాలు అదిరిపోయే రికార్డ్‌ సొంతం అవుతుంది.

  • Published Mar 22, 2024 | 1:56 PMUpdated Mar 22, 2024 | 1:56 PM
కోహ్లీని ఊరిస్తున్న ప్రపంచ రికార్డ్‌! ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌తోనే అందుకుంటాడా?

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సర్వం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో సీఎస్‌కే, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ నేడు(శుక్రవారం) రాత్రి 8 గంటలకు షురూ కానుంది. బాలీవుడ్‌ తారల ఆటాపాటతో అట్టహాసంగా ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో అందరి కళ్లు కోహ్లీ, ధోని పైనే ఉన్నాయి. లాస్ట్‌ ఇయర్‌ ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత మళ్లీ ధోని ఇప్పుడే బరిలోకి దిగుతున్నాడు. అలాగే విరాట్‌ కోహ్లీ సైతం చాలా గ్యాప్‌ తర్వాత తిరిగి గ్రౌండ్‌లోకి దిగుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే.. చాలా గ్యాప్‌ తర్వాత ఆడుతున్న మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో అని ఫ్యాన్స్‌ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీని ఓ భారీ రికార్డ్‌ కూడా ఊరిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే కోహ్లీ ఖాతాలో టన్నుల కొద్ది రన్స్‌, లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. అయినా కూడా కోహ్లీ మరో అద్భుతమైన రికార్డుకు చాలా చేరువగా ఉన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగే ఐపీఎల్‌ 17వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కేవలం 6 పరుగులు చేస్తే చాలు.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఒక్క 6 రన్స్‌ చేస్తే చాలు టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. అయితే.. ఈ రికార్డును విరాట్‌ కోహ్లీ తొలి మ్యాచ్‌లోనే అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కోహ్లీ సూపర్‌ డూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే ఓపెనర్‌గానే బరిలోకి దిగుతున్నాడు. అందుకే కేవలం 6 పరుగులు చేయడం కోహ్లీకి పెద్ద సమస్య కాదు.

2007 నుంచి టీ20 క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన కింగ్‌ కోహ్లీ ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు ఇంటర్నేషనల్‌, ఐపీఎల్‌ టీ20 మ్యాచ్‌లు కలిసి.. మొత్తం 376 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 41.21 యావరేజ్‌తో 133.42 స్ట్రైక్‌రేట్‌తో 11994 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సీఎస్‌కే జరిగే మ్యాచ్‌ కోహ్లీకి 377వ టీ20 మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ ఆరు రన్స్‌ చేస్తే చాలు 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అయితే.. టీ20ల్లో ఇప్పటి వరకు 12 వేల పరుగుల మైల్‌స్టోన్‌ని అందుకున్న ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆరు పరుగులు చేస్తే కోహ్లీ ఆరోవాడు అవుతాడు. కోహ్లీ కంటే ముందు.. క్రిస్‌ గేల్‌ 14,562 రన్స్‌, షోయబ్‌ మాలిక్‌ 13,360 రన్స్‌, కిరన్‌ పొలార్డ్‌ 12,900 పరుగులు, అలెక్స్‌ హేల్స్‌ 12,319 రన్స్‌, డేవిడ్‌ వార్నర్‌ 12,065 పరుగులు చేసి.. 12 వేల రన్స్‌ చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు. మరి కోహ్లీ ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే సాధించాడని మీరూ భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.