Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస ఓటములు ఎదురైనా.. ఈసారి కప్ ఆర్సీబీదే అంటున్నారు ఫ్యాన్స్. వారి ధీమాకు ఓ సెంటిమెంట్ కారణంగా ఉంది. అదేంటంటే?
ఐపీఎల్ 2024 సీజన్ లో వరుస ఓటములు ఎదురైనా.. ఈసారి కప్ ఆర్సీబీదే అంటున్నారు ఫ్యాన్స్. వారి ధీమాకు ఓ సెంటిమెంట్ కారణంగా ఉంది. అదేంటంటే?
Somesekhar
IPL-RCBకి విడదీయరాని సంబంధం ఉంది. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతటి భారీ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీ టీమ్ కు మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా రాలేదు. ఇది ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అయినప్పటికీ.. తమ టీమ్ ఈసారైనా కప్ కొడుతుందని ఆశతో జీవిస్తున్నారు. కానీ ఈ సీజన్ లో కూడా పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్ ను తలెత్తుకోకుండా చేస్తోంది. వరుస ఓటములు ఎదురైనా ఆర్సీబీదే కప్ అని ఫ్యాన్స్ అంటున్నారు. దానికి ఈ సెంటిమెంటే ప్రూఫ్ గా చూపిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో కేవలం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి.. నిరాశపరుస్తోంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఏం లాభం. విజయాలు మాత్రం దక్కడం లేదు. సీజన్లు మారినా, ప్లేయర్లు మారినా..ఆర్సీబీ తలరాత మాత్రం మారడం లేదు. గత 16 సీజన్ల నుంచి అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్ ను ఈసారైనా ముద్దాడాలని భావిస్తోంది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. కానీ ప్రారంభం మాత్రం ఘనంగా లేదు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి.. టోర్నీ నుంచి నిష్ర్కమించే స్టేజ్ కు చేరుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ కథ దాదాపుగా ముగిసినట్లే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఒకే ఒక్క సెంటిమెంట్ ఫ్యాన్స్ ను సంతోషానికి గురిచేస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే? ఆర్సీబీ టీమ్ 2016 సీజన్ లో ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. ఇక ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు కింగ్ విరాట్ కోహ్లీ. అప్పుడు కూడా ఆర్సీబీ ఆడిన తొలి 7 మ్యాచ్ ల్లో 2 విజయాలను మాత్రమే నమోదు చేసుకుంది. ఇక ఈ సీజన్ లో కూడా ఇప్పటి వరకు ఆడిన తొలి 6 మ్యాచ్ ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది.
అదీకాక ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నది కూడా విరాట్ కోహ్లీనే. దీంతో ఈ సెంటిమెంట్ ప్రకారం.. ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుని కప్ కొడుతుందని ఫ్యాన్స్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే.. ఈసారి RCB కప్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కొన్ని కొన్ని సార్లు సెంటిమెంట్స్ రిపీట్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ కూడా అతడికి సపోర్ట్ గా రాణించకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించి.. మిగతా బ్యాటర్లు రాణిస్తేనే ఆర్సీబీ ఫ్యాన్స్ కల నెరవేరుతుందని క్రీడాపండితులు పేర్కొంటున్నారు. మరి ఈ సంప్రదాయం ప్రకారం ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Can Royal Challengers Bengaluru repeat their 2016 run? pic.twitter.com/ER7lPTO6xc
— CricTracker (@Cricketracker) April 13, 2024