iDreamPost

Hardik Pandya: పాండ్యాపై అనుమానం.. ఏదో దాస్తున్నాడు: మాజీ పేసర్ సంచలన కామెంట్స్!

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ పాండ్యాపై అనుమానంగా ఉందని, అతడు ఈ ప్రపంచానికి తెలియకుండా ఏదో దాస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ పాండ్యాపై అనుమానంగా ఉందని, అతడు ఈ ప్రపంచానికి తెలియకుండా ఏదో దాస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Hardik Pandya: పాండ్యాపై అనుమానం.. ఏదో దాస్తున్నాడు: మాజీ పేసర్ సంచలన కామెంట్స్!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం ముందు నుంచే వార్తల్లో వైరల్ గా మారాడు. రోహిత్ ను కాదని అతడికి ముంబై సారథ్య పగ్గాలు ఇవ్వడంతో మెుదలైన రచ్చ.. ఇప్పటికీ సద్దుమణగలేదు. ఒకవైపు ఈ విమర్శలతోనే సతమతమవుతుంటే.. ఇవి చాలదన్నట్లుగా పాండ్యాపై సంచలన ఆరోపణలు చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్. పాండ్యాపై అనుమానంగా ఉందని, అతడు ఈ ప్రపంచానికి తెలియకుండా ఏదో దాస్తున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికంటే ముందు గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం ముంబై టీమ్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు కెప్టెన్సీ వివాదం, మరోవైపు వరుసగా హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు పాండ్యా. వరుసగా రెండు విజయాలు సాధించి.. గెలుపు ట్రాక్ ఎక్కింది ముంబై. దీంతో అతడిపై విమర్శలు కాస్త తక్కువైయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ పాండ్యాపై సంచలన కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఎవ్వరికీ తెలియకుండా ఏదో దాచిపెడున్నాడని అనుమానంగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సైమన్ డౌల్ మాట్లాడుతూ..”ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికంటే ముందే పాండ్యా గాయపడ్డాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే అతడు ఏదో సమస్యతో బాధపడుతున్నాడు. కానీ దాన్ని ఎవ్వరికీ చెప్పట్లేదు. కచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడు. లేకపోతే.. తొలి మ్యాచ్ లో తొలి ఓవర్ వేసిన బౌలర్, అకస్మాత్తుగా బౌలింగ్ వేయకపోవడం ఏంటి? జట్టుకు తన సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే.. ఏదో అనుమానంగా ఉంది” అంటూ క్రిక్ బజ్ షోలో మాట్లాడాడు ఈ కివీస్ మాజీ ప్లేయర్. అయితే ముంబై టీమ్ లో కావాల్సినంత మంది బౌలర్లు ఉన్నారని, అందుకే బౌలింగ్ చేయడం లేదని పాండ్యా వివరణ ఇచ్చుకున్నప్పటికీ.. ఈ వ్యాఖ్యలతో కివీస్ మాజీ ప్లేయర్ ఏకీభవించడం లేదు. మరి సైమన్ డౌల్ చెప్పినట్లుగానే పాండ్యా ఏదో విషయం దాస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి