SNP
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ చేయనన్ని సెంచరీలు చేశారు. ఏకంగా 100 సెంచరీలతో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అయితే.. ఆ వందే కాదు.. సచిన్ 200 సెంచరీలు చేసి ఉండేవాడంటూ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ చేయనన్ని సెంచరీలు చేశారు. ఏకంగా 100 సెంచరీలతో ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అయితే.. ఆ వందే కాదు.. సచిన్ 200 సెంచరీలు చేసి ఉండేవాడంటూ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ ప్రపంచంలో కొంతమంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారి ఆటతో క్రికెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లిన వాళ్లు వారే. అలాంటి వారిలో టీమిండియా లెజెండరీ మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక లెజెండరీ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ప్రముఖులు. వరల్డ్ క్రికెట్‌తో పాటు వారివారి దేశపు జట్లకు ఎంతో సేవ చేసిన ఈ ఆటగాళ్ల ఆల్ టైమ్ గ్రేట్స్‌గా నిలిబడ్డారు. వారి కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. టన్నుల కొద్ది పరుగులు, భారీ రికార్డులు ఉన్నాయి. అయితే.. తాజాగా సనత్ జయసూర్య.. సచిన్ గురించి చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా అప్పుడుంటే.. సచిన్ 200 సెంచరీలు కొట్టేవాడని పేర్కొన్నాడు. మరి జయసూర్య ఈ కామెంట్ ఎందుకు చేశారో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
ప్రస్తుతం క్రికెట్‌లో చాలా రూల్స్ మారాయి. గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా బ్యాటర్లకు ఫేవర్‌గా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ మోడ్రన్ క్రికెట్ రూల్స్‌పై స్పందిస్తూ.. క్రికెట్‌లో వస్తున్న రూల్స్ బ్యాటర్లుకు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నాయి. రెండు కొత్త బంతులు ఇవ్వడం, 30 ఓవర్లకు ముందు ఒక బంతి, 30 ఓవర్ల తర్వాత మరో బంతి వాడటంతో.. రివర్స్ స్వింగ్ బౌలర్లుకు దొరకదు. 35 ఓవర్ల తర్వాత బాల్ రివర్స్ స్వింగ్ అవుతూ ఉంటుంది. రివర్స్ స్వింగ్ అనే కళను కావాల్సిన అవసరం ఉంది. అలాగే బ్యాటర్లు కూడా కాస్త ఛాలెంజ్‌ను ఫేస్ చేయాలి. అని పేర్కొన్నారు.
ఇదే విషయంపై శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య స్పందిస్తూ.. నిజమే.. నేను కూడా వకార్ యూనిస్ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న రెండు బాల్స్ రూల్, పవర్ ప్లే రూల్స్ మా ఎరాలో ఉండి ఉంటే.. సచిన్ టెండూల్కర్ ఇప్పుడు చేసిన రన్స్‌కి, సెంచరీలకు డబుల్ చేశావాడు అంటూ పేర్కొన్నాడు. సచిన్‌కు అంతర్జాతీయ క్రికెట్ 34 వేలకు పైగా పరుగులు, 100 సెంచరీలు ఉన్నాయి. జయసూర్య చెప్పినట్లు.. ఇప్పుడు ఉన్న బ్యాటర్ ఫ్రెండ్లీ రూల్స్ అప్పుడు ఉండి ఉంటే.. సచిన్ ఓ 70 వేల పరుగులు, 200 సెంచరీలు చేసి ఉండే వాడని పేర్కొన్నాడు జయసూర్య. మరి ఆయన చేసిన వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I agree with @waqyounis99 some changes have to be made. If @sachin_rt had the privilege to bat with two balls and under the current power play rules in our era, his runs and centuries would have doubled https://t.co/oIERJiH4d7
— Sanath Jayasuriya (@Sanath07) November 14, 2023