iDreamPost
android-app
ios-app

Ashwin: అశ్విన్‌ మ్యాచ్ మధ్యలో మళ్ళీ రావొచ్చా? రూల్స్‌ ఏం చెప్తున్నాయ్‌?

  • Published Feb 17, 2024 | 6:00 PM Updated Updated Feb 17, 2024 | 6:00 PM

రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడో టెస్ట్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మూడో టెస్ట్‌ మంచి క్రూషియల్‌ స్టేజ్‌కు చేరుకోవడంతో అశ్విన్‌ తిరిగి వస్తాడా? వస్తే అతను ఆడేందుకు అనుమతిస్తారా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మరి రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడో టెస్ట్‌ మధ్యలోంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మూడో టెస్ట్‌ మంచి క్రూషియల్‌ స్టేజ్‌కు చేరుకోవడంతో అశ్విన్‌ తిరిగి వస్తాడా? వస్తే అతను ఆడేందుకు అనుమతిస్తారా? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మరి రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 17, 2024 | 6:00 PMUpdated Feb 17, 2024 | 6:00 PM
Ashwin: అశ్విన్‌ మ్యాచ్ మధ్యలో మళ్ళీ రావొచ్చా? రూల్స్‌ ఏం చెప్తున్నాయ్‌?

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన భారత్‌, ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ప్రస్తుతం 322 పరుగల ఆధిక్యంలో ఉంది భారత్‌. ఈ మ్యాచ్‌పై ఇప్పటివరకు టీమిండియాదే ఆధిక్యం అని చెప్పాలి. ఇక నాలుగో రోజు మరో 150 పరుగులు చేసి.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌ను ఆహ్వానించే అవకాశం ఉంది.

అయితే.. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో టార్గెట్‌ ఛేజ్‌ చేయనివ్వకుండా అడ్డుకోగలదా? అన్నదే ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం జట్టులో స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ లేడు. మిగిలిన నలుగురు బౌలర్లతో ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేయాలి. ఇదే ఇప్పుడు ఇండియాను కంగారుపడుతున్న విషయం. అశ్విన్‌ ఉంటే చాలా ప్లస్‌ అయ్యేది. వాళ్ల అమ్మగారి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అశ్విన్‌ హుటాహుటిన మ్యాచ్‌ మధ్యలోనే చెన్నైలోని తన ఇంటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో జాక్‌ క్రాలేని అవుట్‌ చేయడంతో టెస్టుల్లో 500వ వికెట్‌ మైలురాయిని అందుకున్న అశ్విన్‌.. శుక్రవారం ఆట ముగిసిన తర్వాత చెన్నై వెళ్లిపోయాడు. అయితే.. మ్యాచ్‌ ఫలితం దిశగా వెళ్తున్న తరుణంలో అశ్విన్‌ మళ్లీ తిరిగి రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Can Ashwin come again in the middle of the match

ఒక వేళ అశ్విన్‌ తిరిగి వస్తే.. మ్యాచ్‌ ఆడొచ్చా? ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో బౌలింగ్‌ వేయవచ్చా? లేదా? అసలు రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మూడో టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉన్న అశ్విన్‌. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి 37 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే బౌలింగ్‌ వేసి ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. మూడో రోజు మాత్రం బరిలోకి దిగలేదు. కానీ, అంపైర్‌ ప్రత్యేక అనుమతితోనే అశ్విన్‌ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతను మళ్లి మధ్యలో తిరిగి వస్తే.. ఆడేందుకు అంపైర్‌ అనుమతి ఇచ్చారు. దీంతో.. అశ్విన్‌ నాలుగో రోజు తిరిగి వచ్చినా.. గ్రౌండ్‌లోకి దిగొచ్చు. అలాగే చివరి రోజు వచ్చినా కూడా బరిలోకి దిగి బౌలింగ్‌ వేయవచ్చు అని రూల్స్‌ చెబుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.