వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. రోహిత్‌ శర్మ ఎమోషనల్‌ కామెంట్స్‌!

  • Author singhj Updated - 09:33 PM, Sat - 18 November 23

వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అతడు చేసిన కామెంట్స్​ ఇప్పుడు వైరల్​గా మారాయి.

వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు రోహిత్ శర్మ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అతడు చేసిన కామెంట్స్​ ఇప్పుడు వైరల్​గా మారాయి.

  • Author singhj Updated - 09:33 PM, Sat - 18 November 23

వరల్డ్ కప్.. ఏ ప్రొఫెషనల్ క్రికెటర్​కైనా ఇదే పెద్ద డ్రీమ్. మెగా టోర్నీలో నెగ్గి కప్పును ఒక్కసారైనా చేతబట్టాలనేది చాలా మంది ప్లేయర్ల కల. దీని కోసం కొందరు తమ కెరీర్ మొత్తం ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. భారత గ్రేట్ సచిన్ టెండూల్కర్ అయితే కెరీర్ ఆఖర్లో ప్రపంచ కప్ డ్రీమ్​ను తీర్చుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 2011లో తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. 2003లోనే ప్రపంచ కప్​ను అందుకునేవాడు సచిన్. కానీ ఆ ఏడాది ఫైనల్​లో భారత్​ను ఓడించి కప్పును ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. 2003లో వరల్డ్ కప్ మిస్సవ్వడంతో మళ్లీ 2011 వరకు అంటే ఎనిమిదేళ్ల పాటు సచిన్​కు ఎదురు చూపులు తప్పలేదు.

స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో భారత్ కప్పును అందుకుంది. మాస్టర్ బ్లాస్టర్ కోసమైనా ట్రోఫీ నెగ్గాలనే కోరిక, తపన అప్పటి టీమ్​లో కనిపించాయి. అందుకే ఫైనల్​లో శ్రీలంకపై నెగ్గగానే జట్టు సభ్యులంతా తిరంగాలు పట్టుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్​ను తమ భుజాల మీద మోస్తూ గ్రౌండ్ మొత్తం కలియతిరిగారు. ఆ మూమెంట్స్​ను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక తరాన్ని క్రికెట్ ఆడేందుకు ఎంకరేజ్ చేసిన క్షణాలవి. అప్పట్లో కపిల్ డెవిల్స్ సాధించినట్లే, 2011లో ధోని అండ్ కో కప్పు సొంతం చేసుకొని ఎందరో యువతను జెంటిల్మన్ గేమ్​ను తమ కెరీర్​గా మలచుకునేలా చేశాయి. భారతీయుల మనసుల్లో 2011 వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్స్​ నింపిన సంతోషం, ఇచ్చిన కిక్ అలాంటిది.

ఆ ఏడాది కప్పు నెగ్గిన టీమ్​లో రోహిత్ శర్మ లేడు. అవును, ప్రపంచ కప్ గెలిచిన జట్టులో హిట్​మ్యాన్​కు చోటు దక్కలేదు. దీంతో అతడు బాగా కుమిలిపోయాడు. ఫిట్​నెస్​ సమస్యలు, కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేయకపోవడం తదితర కారణాల వల్ల ఆ ఏడాది మెగా టోర్నీలో ఆడిన జట్టులో రోహిత్​కు ప్లేస్ దక్కలేదు. అయితే గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా దూసుకొచ్చిన హిట్​మ్యాన్.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్​లో టీమిండియకు కెప్టెన్సీ వహించే స్థాయికి ఎదిగాడు. ఈసారి అతడి నేతృత్వంలోనే జట్టు ఫైనల్​కు చేరుకుంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత క్రికెట్​లో రోహిత్ ఎరా మొదలైంది. ఓపెనర్​గా ధనాధన్ ఇన్నింగ్స్​లు, సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదుతూ టీమ్​లో తన ప్లేస్​ను ఫిక్స్ చేసుకున్నాడు హిట్​మ్యాన్.

విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక జట్టులో వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాడు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచి, ఫెయిలైనా వరుస అవకాశాలు ఇస్తూ మంచి రిజల్ట్స్ రాబడుతున్నాడు. అలాంటి రోహిత్ 2011 వరల్డ్ కప్​లో ఆడకపోవడం, ఈసారి టీమ్​కు కెప్టెన్సీ చేయడంపై స్పందించాడు. ‘2011లో టీమ్​లో ప్లేస్​ దక్కకపోవడం కఠిన సమయం. కానీ నేను ఇప్పుడు ఉన్న పొజిషన్​కు హ్యాపీగా ఉన్నా. వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టుకు కెప్టెన్​గా ఉండి ముందుకు నడిపిస్తానని నేను ఎక్స్​పెక్ట్ చేయలేదు. కానీ అలా జరిగిపోయింది. ప్రపంచ కప్​కు ముందు వరకు టీమ్​లో మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని అనుకున్నా’ అని చెబుతూ రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. మరి.. వరల్డ్ కప్ ఫైనల్​పై హిట్​మ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫైనల్‌లో గెలవాలంటే.. టాస్‌ గెలిచి ఏం తీసుకోవాలి? రికార్డ్స్‌ ఏం చెబుతున్నాయ్‌?

Show comments