రాముడిపై భక్తి.. బ్యాట్​ మీద ‘ఓం’ సింబల్! ఆ విదేశీ ఆటగాడు ఎవరో తెలుసా?

  • Author singhj Updated - 06:45 PM, Sat - 14 October 23
  • Author singhj Updated - 06:45 PM, Sat - 14 October 23
రాముడిపై భక్తి.. బ్యాట్​ మీద ‘ఓం’ సింబల్! ఆ విదేశీ ఆటగాడు ఎవరో తెలుసా?

భారత సంతతి ఆటగాళ్లు ఇతర దేశాలకు ప్రాతినిధ్యం వహించడం గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. ముఖ్యంగా క్రికెట్​లో దీన్ని ఎక్కువగా చూస్తుంటాం. భారతి సంతతి ఆటగాళ్లలో కొందరు ఇక్కడే క్రికెట్ నేర్చుకొని, అవకాశాలు రాక విదేశాలకు వలస పోయిన వాళ్లయితే.. మరికొందరు మాత్రం అక్కడే పుట్టినవాళ్లు. కానీ వారి అమ్మానాన్నలు లేదా తాత, ముత్తాతల కాలంలో భారత్ నుంచి వలసి వెళ్లిన వారే అయి ఉంటారు. సో, ఏదో విధంగా వారికి ఈ గడ్డతో సంబంధం ఉంటుందనే చెప్పాలి. అలా భారతీయ మూలాలు కలిగిన క్రికెటర్లలో ఒకడు కేశవ్ మహరాజ్. సాతాఫ్రికా క్రికెట్ టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్ అయిన కేశవ్ మహరాజ్​కు ఇండియాతో కనెక్షన్ ఉంది. అతడి పూర్తి పేరు కేశవ్ ఆత్మానంద్ మహరాజ్.

కేశవ్ మహరాజ్ పూర్వీకులు చాలా ఏళ్ల కిందే భారత్ వదిలి బతుకుదెరువు కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారట. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన కేశవ్.. వన్డేలతో పాటు టీ20లు, టెస్టుల్లో సఫారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌతాఫ్రికాలోని డర్బన్​లో పుట్టి పెరిగిన కేశవ్​.. కెరీర్ మొదట్లో డర్బన్స్ సూపర్ జియాంట్స్, మిడిలెస్సెక్స్ కంట్రీ క్రికెట్ క్లబ్​ తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడి టాలెంట్​కు మెచ్చి నేషనల్ టీమ్​లో ఛాన్స్ ఇచ్చారు సెలెక్టర్లు. ఇంటర్నేషనల్ కెరీర్​లో తనకు దొరికిన ప్రతి ఛాన్స్​ను సద్వినియోగం చేసుకున్నాడు కేశవ్ మహరాజ్. అందుకే టీమ్​లో రెగ్యులర్​ ప్లేయర్​గా మారాడు. బాల్​తో పాటు అవసరమైనప్పుడు బ్యాట్​తోనూ సఫారీ జట్టుకు విలువైన రన్స్ అందిస్తుంటాడు కేశవ్.

కేశవ్ బ్యాట్ మీద ఉన్న ఒక గుర్తు ఇప్పుడు వైరల్​గా మారింది. అదే ఓం సింబల్. ఈ గుర్తు ఉన్న బ్యాటుతో కొన్నేళ్లుగా క్రీజులోకి దిగుతున్నాడు కేశవ్. అయితే తాజా వరల్డ్ కప్​లో ఇది వెలుగులోకి వచ్చింది. సౌతాఫ్రికాలో పుట్టి పెరిగినప్పటికీ భారతీయ మూలాల్ని, ఇక్కడి మత విశ్వాసాల్ని కేశవ్ కుటుంబం వదిలిపెట్టలేదు. రాముడితో పాటు హనుమంతడిపై కేశవ్​కు నమ్మకం ఎక్కువట. గతంలో ఒకసారి భారత్ పర్యటన టైమ్​లో తిరువనంతపురంలోని ఒక హిందూ ఆలయంలో కేశవ్ పూజలు చేశాడు. ఇప్పుడు అతడి బ్యాట్​పై ఉన్న ఫొటోలతో పాటు అప్పటి పూజా ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. విదేశాల్లో పుట్టి పెరిగినా భారతీయ మూలాల్ని వదలని కేశవ్ మహరాజ్​పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్‌పై బరిలోకి గిల్! ఇంత ఫాస్ట్‌గా కోలుకోవడానికి కారణం?

Show comments