వరల్డ్ కప్​తో భారత్​పై కాసుల వర్షం.. దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్!

  • Author singhj Published - 09:42 PM, Fri - 6 October 23
  • Author singhj Published - 09:42 PM, Fri - 6 October 23
వరల్డ్ కప్​తో భారత్​పై కాసుల వర్షం.. దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్!

క్రికెట్​లో వన్డే వరల్డ్ కప్​కు ఉండే పాపులారిటీ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. దైపాక్షిక సిరీస్​లతో పాటు మూడ్నాలుగు దేశాలు పాల్గొనే టోర్నమెంట్​లు ఉన్నప్పటికీ అవేవీ ప్రపంచ కప్​కు సాటిరావు. క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు లైఫ్​లో ఒక్కసారైనా ఈ కప్పును గెలవాలని అనుకుంటాడు. అలాంటి వరల్డ్ కప్​కు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో పాకిస్థాన్​తో కలసి ఒకసారి, ఆ తర్వాత బంగ్లాదేశ్​, శ్రీలంకలతో కలసి మరోసారి మెగాటోర్నీని హోస్ట్ చేసిన ఇండియా.. ఈసారి మాత్రం సోలోగా వరల్డ్ కప్​ను నిర్వహిస్తోంది.

బీసీసీఐతో పాటు భారత్​పై ప్రపంచ కప్-2023 కాసుల వర్షం కురిపిస్తోందని తెలుస్తోంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలను మెగా టోర్నీ తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు ఎకానమిస్టులు భావిస్తున్నారు. వరల్డ్ కప్​కు ఆతిథ్యం ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్​ను ఇస్తోందని అంటున్నారు. ఇండియన్ ఎకానమీని 220 బిలియన్ల మేర ఇది పుష్ చేస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టూరిజం, ఆతిథ్యం, రిటైల్, టికెట్స్ విభాగాల నుంచి ఈ మొత్తం సమకూరుతుందని భావిస్తున్నారు. ఒకరకంగా ఈ టోర్నీ దేశ ఎకానమీపై సిక్సర్ కొట్టినట్లేనని అంటున్నారు.

వరల్డ్ కప్ మ్యాచులకు భారీ సంఖ్యలో దేశ, విదేశీ టూరిస్టులు హాజరు కానున్నారు. తద్వారా హోటల్స్, ఫుడ్, జర్నీ, షాపింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తారు. ఒక్కో మ్యాచ్​ కోసం కనీసం వెయ్యి మంది టూరిస్టులు వస్తారని ఊహించినా భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు రూ.600 కోట్లు వచ్చి చేరినట్లేనని ఎకానమిస్టుల అంచనా. ఇక ట్యాక్సుల రూపంలోనూ మెగా టోర్నీ సర్కారు ఖజానాకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. టికెట్ సేల్స్ మీద పన్నులు, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఫుడ్ డెలివరీ సర్వీసులపై జీఎస్టీల ద్వారా భారీగా ఆదాయం సమకూరనుందని చెబుతున్నారు. హోటల్ రెంట్స్, ఎయిర్ లైన్స్ టికెట్ రేట్స్ కూడా పెరగనుండటంతో 0.25 శాతం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తుందని సమాచారం.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి ద్రవిడ్-రోహిత్ సూపర్ ప్లాన్!

Show comments