వన్డే వరల్డ్ కప్-2023లో బిగ్ మ్యాచ్‌కు అంతా రెడీ అయిపోయింది. భారత్, పాకిస్థాన్‌లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం దాయాదుల పోరుకు వేదిక కానుంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సెలబ్రిటీస్ ఆటపాటలతో వేరే లెవల్లో ఈ మ్యాచ్ సెర్మనీని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు వినిపించింది. దీంతో వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్‌కు సెర్మనీ నిర్వహించలేదని.. అలాంటిది ఇండో-పాక్ మ్యాచ్‌కు ఎలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారని బీసీసీఐపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు గనుక ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే అది మిగతా జట్లను, ఆయా టీమ్స్ కెప్టెన్స్‌ను అవమానించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అయ్యారు. అయినా భారత క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గడం లేదు. ఇండో-పాక్ మ్యాచ్‌కు ముందు మ్యూజికల్ ఒడిస్సీకి ఏర్పాట్లు చేస్తోందట. బాలీవుడ్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ఇందులో పాల్గొంటారని టాక్. అరిజిత్‌తో పాటు పాపులర్ సింగర్స్ శంకర్ మహదేవన్, నేహా కక్కర్, సుఖ్వీందర్ సింగ్ కూడా తమ ఆటపాటలతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించనున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ తమన్నా భాటియాలు కూడా తమ పెర్ఫార్మెన్స్‌లతో రచ్చ చేయనున్నారని సమాచారం.
ఇక, ఒకప్పటితో పోలిస్తే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లంటే ఉండే టెన్షన్ వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌పై ఫ్యాన్స్‌లో ఉండే ఇంట్రెస్ట్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ గ్రౌండ్లో అప్పటిలా ఉద్రిక్త వాతావరణం కనిపించడం లేదు. ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లు చాలా తక్కువ. ఇండో-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదు. దీంతో ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. అయితే దాయాదుల సమరంలో తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగే ఆటగాళ్లు తప్పక రాణించాల్సిన పరిస్థితి. బాగా ఆడితే ప్రశంసలు.. ఫెయిల్ అయ్యారా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఈసారి మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి. మరి.. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ సెలబ్రిటీల పెర్ఫార్మెన్స్ చూడటానికి మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సామాన్యుడికి సత్కారం.. ఎవరితను?
Performers at the India Vs Pakistan World Cup match at the Narendra Modi Stadium. pic.twitter.com/py0np1AG0y
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2023