Nidhan
టీమిండియాను ఆస్ట్రేలియా వదలడం లేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను జిడ్డులా పట్టుకొని ఇబ్బంది పెడుతోంది ఆసీస్.
టీమిండియాను ఆస్ట్రేలియా వదలడం లేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను జిడ్డులా పట్టుకొని ఇబ్బంది పెడుతోంది ఆసీస్.
Nidhan
‘నువ్వు యాడికెళ్తే ఆడికొస్త సువర్ణ’.. అనే పాటను వినే ఉంటారు. అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపిందీ సాంగ్. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం.. ఈ సాంగ్‌ను బట్టీ పట్టిందేమో గానీ భారత్‌ను వదలడం లేదు ఆస్ట్రేలియా. ఐసీసీ టోర్నమెంట్స్‌లో టీమిండియాను టార్గెట్‌గా చేసుకొని మరీ ఓడిస్తోంది. ద్వైపాక్షిక టోర్నీల్లో మన చేతుల్లో ఓడినా.. మెగాటోర్నీలో మాత్రం మనల్ని ఓడించకుండా వెళ్లేదేలే అనేలా ఆడుతోంది. ఒక్క ఏడాదిలోనే మూడు ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును ఓడించింది ఆసీస్. గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి ఇది స్టార్ట్ అయింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో మనల్ని ఓడించి విజేతగా నిలిచింది కంగారూ టీమ్. అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లోనూ విజయం వారినే వరించింది.
ప్రపంచ కప్-2023లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకున్న రోహిత్ సేనను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. దీంతో కప్పు కల చేజారింది. ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్‌లో దెబ్బకొట్టింది. అయితే ఇది సీనియర్ల ప్రపంచ కప్ కాదు.. అండర్-19 వరల్డ్ కప్. ఈ టోర్నీలో భారత కుర్రాళ్లు ఫైనల్ వరకు అప్రతిహత విజయాలతో దూసుకొచ్చారు. కానీ ఫైనల్ ఫైట్‌లో డేంజరస్ ఆసీస్ ముందు నిలబడలేకపోయారు. 79 పరుగుల తేడాతో ఓడి కప్పును చేజార్చుకున్నారు. సెంచరీల మీద సెంచరీలు, వికెట్ల మీద వికెట్లు తీస్తూ లీగ్, నాకౌట్ దశ వరకు అదరగొట్టిన మన కుర్రాళ్లు.. ఫైనల్లో ఆసీస్ జోరు ముందు చతికిలపడ్డారు. దీంతో కలతో పాటు కప్పు కూడా చేజారింది. ఇది చూసిన భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
గతేడాది సీనియర్లు మిస్సయ్యారు.. కనీసం జూనియర్లు అయినా దేశానికి ఇంకో వరల్డ్ కప్ అందిస్తారంటే వాళ్లూ చేతులెత్తేయడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అసలీ ఆసీస్ ఫోబియా, ఫైనల్ ఫోబియా ఏంట్రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. దీని నుంచి మన టీమ్ ఎప్పుడు బయటపడుతుందా అని ఆలోచిస్తున్నారు. డామినేషన్ చేసే కంగారూలను ఓడించాలంటే వాళ్ల స్టైల్లో అటాకింగ్ గేమ్ ఆడాలని.. భయం లేకుండా ఫియర్లెస్ అప్రోచ్‌తో ఉంటే తప్ప గెలవలేమని అంటున్నారు. ఫైనల్లో ఆడుతున్నామనే ఒత్తిడి కూడా పెట్టుకోవద్దని.. అప్పుడే నెగ్గుతామని కామెంట్స్ చేస్తున్నారు. ఆసీస్ ఇలా టెన్షన్ లేకుండా కూల్‌గా, తమ గేమ్ తాము ఆడి గెలుస్తోందని చెబుతున్నారు. శనిలా దాపురించిన కంగారూలను నెక్స్ట్ వరల్డ్ కప్‌లో వదలొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ టీమ్ మనల్ని జిడ్డులా పట్టుకుందని.. దాని బారి నుంచి బయటపడాలంటే వాళ్ల దారిలోనే వెళ్లి దెబ్బ కొట్టాలని అనలిస్టులు కూడా సూచిస్తున్నారు. మరి.. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ ఫోబియాను దాటాలంటే భారత్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: U19 World Cup 2024: చేజారిన వరల్డ్ కప్.. గెలవాల్సిన మ్యాచ్‌లో మనోడి వల్లే ఓటమి!
#Aus19 won the #U19WorldCup2024#U19WorldCupFinal #IND19vAUS19 pic.twitter.com/sh2USw1j5T
— Fukkard (@Fukkard) February 11, 2024