iDreamPost
android-app
ios-app

T20 WC 2024: మరో 60 రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌.. భారీ రిస్క్‌ తీసుకుంటున్న అమెరికా!

  • Published Apr 03, 2024 | 4:27 PM Updated Updated Apr 03, 2024 | 4:27 PM

మరో 60 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతోంది.. ఈ నేపథ్యంలో అమెరికా భారీ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంతకీ యూఎస్ఏ తీసుకునే ఆ రిస్క్ ఏంటి? దానికి ఇండియా vs పాకిస్థాన్‌ మ్యాచ్ తో సంబంధం ఏంటి? పూర్తి వివరాలు..

మరో 60 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతోంది.. ఈ నేపథ్యంలో అమెరికా భారీ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంతకీ యూఎస్ఏ తీసుకునే ఆ రిస్క్ ఏంటి? దానికి ఇండియా vs పాకిస్థాన్‌ మ్యాచ్ తో సంబంధం ఏంటి? పూర్తి వివరాలు..

T20 WC 2024: మరో 60 రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌.. భారీ రిస్క్‌ తీసుకుంటున్న అమెరికా!

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఈ మెగా జాతర ముగిసిన తర్వాత మరో టోర్నీ అభిమానులను అలరించడానికి సిద్దంగా ఉంది. టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 2న ప్రారంభం కానుంది. ఇందు కోసం ఇప్పటి నుంచే జట్లు తమ తమ ప్లాన్స్ ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్ ఈ మెగా టోర్నీకి ముందు టీమ్స్ కు మంచి ప్రాక్టీస్ కూడా దొరికింది. అయితే మరో 60 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతోంది.. ఈ నేపథ్యంలో అమెరికా భారీ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి ఇంతకీ యూఎస్ఏ తీసుకునే ఆ రిస్క్ ఏంటి? దానికి ఇండియా vs పాకిస్థాన్‌ మ్యాచ్ తో సంబంధం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2024 మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాలను కలవరపెడుతోంది. టీ20 వరల్డ్ కప్ జూన్ 2న ప్రారంభం కానుంది. ఇక ఈ మెగా టోర్నీలో జూన్ 9న చిరకాల ప్రత్యర్థి అయిన దాయాది దేశం పాకిస్తాన్ తో తలపడనుంది టీమిండియా. ఈ మినీ యుద్ధానికి నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మారనుంది. ఈ పోరు కోసం ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఐసీసీ ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొట్టి ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. స్టేడియం నిర్మాణం సగం కూడా పూర్తి కాలేదు. పైగా జూన్ 9న ఇండియా-పాక్ తలపడనున్నాయి. రెండు దేశాల మధ్య మ్యాచ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికి తెలియనిది కాదు. మరి ఈ రేంజ్ లో ఉండే మ్యాచ్ కు అభిమానులు ఎలా పోటెత్తుతారో.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి మ్యాచ్ జరిగే స్టేడియాన్ని ఇంత త్వరగా నాణ్యత లేకుండా నిర్మిస్తే.. ప్రమాదం జరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

34 వేల కెపాసిటీతో నిర్మించ తలపెట్టిన ఈ స్టేడియం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన నెలలో ఈస్ట్ స్టాండ్ స్టేడియంలో 12, 500 మంది కూర్చునే గ్యాలరీని నిర్మించారు. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అగ్ర దేశం అంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా.. ఇలా గ్రౌండ్ నిర్మాణంలో నత్తనడకన పనులు నిర్వహించడం వివాదానికి తావిస్తోంది. దీంతో అమెరికా రిస్క్ తీసుకుంటుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి స్టేడియం నిర్మాణం ఇంకా కొనసాగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఇదికూడా చదవండి: IPL తెలుగు ఫ్యాన్స్‌కి కావ్య పాప ఫేమస్! కానీ, అప్పట్లో గాయత్రి రెడ్డి ఫాలోయింగ్ అంతకుమించి!